15.01.2025....           15-Jan-2025

   మా వీధి సంక్రాంతి శోభ!

చల్లపల్లి జనులందున సౌందర్యపిపాస పెరిగి

గంగులపాలెం బాటన పండుగ సందడి హెచ్చెను

ఇరుగుపొరుగు ఊళ్ళ వాళ్ళ సెల్ఫీలీ వీధిలోన

విడివిడిగాగ్రూపులుగా వందల ప్రజలిచ్చోటికి!

 

అసలెవ్వరిదీ ఆలోచనఏ సద్భావన పునాది?

ఎవరి దింత ధన వ్యయముఎవ్వరి శ్రమ దీని వెనుక?

నరకంగా పేరొందిన అప్పటి రహదారా ఇది?

మానవ శ్రమ సాధించిన మంచికి తార్కాణం ఇది!