29.09.2025....           29-Sep-2025

 కథాసమయం - ఫల శ్రుతి మయం.

కథ విందువా స్వచ్ఛ కథ విందువా

కను విప్పు కలిగించు కథవిందువా!     కథవిందువా॥

పల్లెనూ కాదు - నే పట్టణాన్నీ కాదు

చల్లపల్లిని నేను నేను చరిత కెక్కినదాన్ని

కృష్ణ జిల్లాలోన కీర్తి పొందినదాన్ని

ఎన్నెన్నో ఒడుదొడుకు లెదుర్కొనిన దాన్ని

ఎందరో ప్రముఖులకు జన్మనిచ్చితి నేను

               కథవిందురా నా వ్యథవిందురా

               కనువిప్పు కలిగించు కథ విందురా!

ఎన్నొ ఉన్నవి గాని – స్వచ్ఛ శుభ్రత లేని,

ఆహ్లాదకరమైన వాతావరణము లేని,

కళా కాంతులు లేని గ్రామ వీధులు నావి!

అందుకే ఆరోగ్యమంతంత మాత్రముగ

మిగిలి పోతిని నేను - పొగిలి పోతిని నేను

               కథవిందురా మనోవ్యధవిందురా

               కను విప్పు దొరికిన కథ విందురా!        - సశేషం 

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   29.09.2025