కొన్ని పోలికలు.
అక్కడ హిమాలయాల్లో దేశ భద్రతకోసం వీర సైనికులు!
ఇక్కడి భీకరమైన మంచులో “స్వచ్చ- హరిత- సుందర చల్లపల్లి” కోసం స్వచ్చ సైనికులు!
కోనసీమ కొమరాడను కలుషితం చేస్తూ ‘గ్లాస్ బ్లోఅవుట్’ ఒక వైపు!
హరిత – పరిశుభ్రతలు నిలిపి, భూమి ఉపరితలాన్ని రక్షిస్తూ చల్లపల్లి కార్యకర్తలొక వైపు!
చేతి చమురు వదలించు కొంటూ శ్రమను పెట్టుబడిగా పర్యావరణ భద్రతకై చల్లపల్లి ఒక ప్రక్క!
సమున్నత లక్ష్యం మరువక - మీరుతున్న వయస్సులను మరచి దశాబ్దాలుగా శ్రమ యజ్ఞం చేస్తున్న మిమ్ము ఎంతగా- ఎలా- అభినందించను?
- బెల్లంకొండ వీరాంజనేయులు,
- రిటైర్డ్ ప్రిన్సి పల్
-చిలకలూరిపేట,