16.04.2022 (పాట)....           16-Apr-2022

 

ఓహోహో స్వచ్చోద్యమమా!

 

ఓహోహో స్వచ్చోద్యమమా నా -  గ్రామ భవితవ్య కీలకమా!

సకాల సముచిత నిర్ణయమా ! శుభ స్వచ్ఛ సౌందర్య వికాసమా!

                                                            ఓహో! ఓ స్వచ్చోద్యమమా॥

 

బాహ్య విసర్జన కాలములో దు - ర్గంధ భూయిష్ట గ్రామములో

మాకై వచ్చిన విప్లవమా ! మా - చల్లపల్లికే ఒక వరమా!

                                                            ఓహోహో స్వచ్చోద్యమమా॥

 

ఊరి కాలుష్య ధ్వంసములో జన - స్వస్త సంక్షేమ సాధనలో

స్వచ్ఛ సైనికుల త్యాగముతో పరి - పుష్టి చెందు శ్రమవినోదమా

                                                            ఓహోహో! స్వచ్చోద్యమమా॥

 

శత సంఖ్యాధిక సైన్యంతో సుమ - సుందర బంధుర లక్ష్యంతో

అలవని - సొలవని పయనంతో ఒక - విశ్వవిఖ్యాత వివేకమా!

                                                            ఓహోహో! స్వచ్చోద్యమమా॥

 

కను విందగు రహదారులతో ఘుమ - ఘుమలాడే సుమ బాలలతో

సందర్శకులను రమ్మని పిలిచే - స్వచ్ఛ సౌందర్య విలాసమా!

 

ఓహోహో! స్వచ్చోద్యమమా నా - గ్రామ భవితవ్య కీలకమా!

సకాల సముచిత నిర్ణయమా! శుభ స్వచ్ఛ సౌందర్య వినోదమా!

                                                            ఓహోహో! స్వచ్చోద్యమమా॥