ప్రాతూరి శాస్త్రి 04.09.2020....           04-Sep-2020

 *కీర్తి కాంక్షలను వదలి సేవ చేసే వారికి విజయం పక్కనే ఉంటుంది.*

 

1600 వ రోజు సుందర చల్లపల్లి 30.03.2019

 

గంగులవారిపాలెం రోడ్డులో సేవ

సెల్ఫీ పోస్ట్ ప్రారంభోత్సవం

పద్మాభిరామం ప్రారంభోత్సవం

అతిధులుగా విజయవాడలో జనతా వైద్యశాల డా.రాం ప్రసాద్ గారు వారి సతీమణి రావడం విశేషం

 

పదిహేను మందితో మొదలైంది స్వచ్ఛ కార్యక్రమం.

 

దరిజేర సాగారు ఒక్కొక్కరూ స్వచ్ఛసేవలో.

 

హాయిగావుండే వేకువసేవ నచ్చి స్థిర పడ్డారు స్వచ్ఛ సేవలో.

 

రుతువులు లెక్కచేయక ఎంత కష్టమైన పనినైనా అవలీలగా చేస్తారు.

 

వందల దినాలు గడిచినా అదే పట్టుదల, అదే దీక్షతో దరులనందముగా నుంచి గడ్డి పరకనైనా మొలవనీని దిట్టలైరి కార్యకర్తలు,

రారండోయ్ వేడుకచేద్దామంటూ చేరిరి పద్మాభిరామాన.

 

5.30 నిముషాలకు గంగులవారిపాలెం రోడ్డులో స్వచ్ఛ కార్యకర్తలచే తయారు చేయబడిన సెల్ఫీ పాయింట్/ ఫోటో పాయింట్ ను డా. రాం ప్రసాదు గారు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

 

 ఆ తరువాత నూతనంగా తయారు చేయబడిన 'పద్మాభిరామం' ప్రదేశాన్ని స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం మొదలు పెట్టిన రోజున ఉన్న కార్యకర్తలలో ఒకరైన శ్రీ తూములూరు లక్ష్మణ రావు గారు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

 

అనంతరం 'పద్మాభిరామం' లో జరిగిన ఆత్మీయ సమావేశంలో స్వచ్ఛ కార్యకర్తల నిస్వార్ధ కృషిని డా. రాంప్రసాదు గారు, వారి శ్రీమతి కొనియాడారు.

 

- ప్రాతూరి శాస్త్రి 

04.09.2020