ప్రాతూరి శాస్త్రి - 06.09.2020. ....           06-Sep-2020

5 వ వార్షికోత్సవ సమయాన

"సాహో చల్లపల్లి, సాహో చల్లపల్లి" యని ఆశీస్సులు పంపిన శ్రీ యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు.

5 వ వార్షికోత్సవ వేడుకలు 17.11.2019

గ్రామ ప్రగతిలో స్వచ్ఛసేవకులు.

ఈనాటి 5 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి.

పద్మావతి ఆసుపత్రి నుండి పాదయాత్రతో బయలుదేరి కీర్తి ఆసుపత్రి నుండి బైపాస్ రోడ్డులో కమ్యూనిస్టు బజారు నుండి నాగాయలంక రోడ్డులో అమరస్తూపం వరకు

అక్కడనుండి డంపింగ్ యార్డు వరకు

అచటనుండి ఏటీఎం సెంటరు వరకు

బైక్ ర్యాలీ నిర్వహించారు.

తదనంతరం సభప్రారంభం. 

పూజ్య బాపూజీ ఉద్దేశ్యాలకనుగుణంగా

డా.డీఆర్కే. ప్రసాదు గారు, డా. పద్మావతి గారు 5 సంవత్సరాల నుండి తమ కార్యకర్తలతో నడిపించిన మహోద్యమం.

సభ ప్రారంభం చల్లపల్లి పబ్లిక్ స్కూలు విద్యార్థులు స్వాగత గీతంతో ప్రారంభించారు.

గాన కళాకారుడు శ్రీ శ్రీనివాస్ పాటలు, పద్యాలతో వచ్చిన వారికి చైతన్యం కలిగించారు.

ప్రతిఒక్కరు పారిశుధ్య కార్మికునిగా మారినపుడే  దేశంలో పరిశుభ్రత వస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ సింహాద్రి రమేషుబాబు గారు పలికారు.

ప్రతి మండలంలో డాక్టర్ దంపతుల వంటివారు ఉంటే ఆంధ్రప్రదేశ్ త్వరలో హరిత ఆంధ్రప్రదేశ్ గా మారుతుందన్నారు.

ముఖ్య అతిధి శ్రీ చంద్రబోస్ గారు గ్రామప్రజలను, విద్యార్థిని విద్యార్థులను ఉత్తేజపరుస్తూ

చాలా పాటలు పాడారు.

నేనున్నంతకాలం ఈ చల్లపల్లి కి విశేష వ్యక్తులను తీసికొచ్చి చల్లపల్లి దర్శింపచేస్తానని శ్రీ డా. గురవారెడ్డి గారు పల్కినారు.

మహిళల తరఫున శ్రీమతి కృష్ణకుమారి గారు మంచి సందేశమిచ్చారు.

శ్రీలంకబాబుగారు ఉద్యమ ప్రారంభం నుండి ఈరోజు వరకు జరిగిన సంఘటనలు వివరించారు.

డా.పద్మావతిగారు వ్యాఖ్యాతయి డా.డీ.ఆర్కే. ప్రసాదు గారితో సమన్వయపరుస్తూ సభ దిగ్విజయంగా నడిపినారు.

వివేకానంద డిగ్రీ కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులు శ్రీ చంద్రబోస్ గారు రచించిన సినీ గేయాలకు డాన్స్ చేశారు. 

తుది గా రంగస్థలం సినిమా పాటకు డా.పద్మావతి గారు, డా.డీఆర్కే. ప్రసాదు గారు డాన్స్ చేశారు.

- ప్రాతూరి శాస్త్రి

06.09.2020.