ప్రాతూరి శాస్త్రి - 07.09.2020. ....           07-Sep-2020

మహిళలు..వారి సేవలు

 

తమ గృహాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే మహిళ సేవ చేయ వస్తే....

      జీవించడంలో జీవం అనుభూతిని

పొందే మహిళ సేవ చేయ వస్తే...

       ఆకాశములో ఇంద్రధనసులా మెరిసిపోయే మెరిసే మహిళ స్వచ్ఛ చల్లపల్లి లో అడుగిడి సేవచేస్తుంటే....

       సేవచేయుటలో పురుషుల దాటి మరో మైలురాయి చేరుకుంటుంది.

       స్వచ్ఛ చల్లపల్లి మహిళల లక్ష్యం సుందర చల్లపల్లియే.

 

ముప్పదియైదు దినాలు దాటిన క్షణాన అడుగిడె డా.పద్మావతి

ఆయమ్మ ననుసరించిరి మహిళలు ఒక్కొక్కరిగా

పుడమితల్లి పులకించి అనుకునే

నా సొగసు పెంచ వచ్చిన వసుంధర

ఈమే గదా యని.

 

ముద్దబంతులు ముంగిట ముగ్గులొదిలి సేవజేయ తరల,

మహిళాసైన్యము జూచి చెట్లు శిరసు వంచె,

ప్రక్కనున్న వరిచేలు స్వాగతం పలికే,

శుభ్రతకు మారుపేరైన మహిళలు కదలిరాగా

 

ఆనందాన కిలకిలారావములతో పక్షులు ఆకసమునకు ఎగిరె.

 

ధనలక్ష్మి, ముత్యాల లక్ష్మీ, అన్నపూర్ణ, కృష్ణకుమారి, ప్రశాంతమణి, భారతి, మాధురి ఇలా ఎందరెందరో అమూల్యమైన సేవ చల్లపల్లి కి చేశారు.

 

తొలినాళ్లలో రోడ్లు ఊడ్చుటకు ప్రాధాన్యమిచ్చారు.

 

తరువాతి రోజుల్లో అశుద్దాలే తీశారో, మగవారితో సమానంగా డ్రైన్లు శుభ్రతే చేశారో

 

మొక్కలు నాటడంలోను, చిట్టడవిలాంటి స్థలాలను శుభ్రం చేయడంలోనూ,

గ్రామ సుందరీకరణలోను వారి భాగస్వామ్యం ఎనలేనిది.

భాషించకుండా సేవజేయు సుభాషిణిగారు,

ఎచ్చటనైన, ఏపనినైన చేయుదురు ఆసుపత్రి సిబ్బంది,

డ్రైన్లు సైతం శుభ్రం చేయగల అన్నపూర్ణ గారి బృందం

వచ్చునది రెండురోజులై న

నైపుణ్యం చూపు లక్ష్మీసెల్వం గారు

వేరెక్కడ జూడమయ్య ఇటువంటి స్త్రీశక్తి.

అందుకే అన్నారు మహిళలు నిజంగానే మహారాణులు.

కొసమెరుపు

ఒకచే కొడవలి,గొర్రు .ఆరోకచేతబట్టి,

సేవకవసరమగు పనిముట్లు చేతబట్టి,

అపర భగీ రధుని వలె బయలెల్లే

గ్రామము నందనవనము జేయ మా యమ్మ డా.పద్మావతి

 

- ప్రాతూరి శాస్త్రి

07.09.2020.