ప్రాతూరి శాస్త్రి - 08.09.2020.....           08-Sep-2020

ప్రార్ధించే పెదవుల కన్నా సేవలు చేసే చేతులు మిన్న..

సుందరీకరణ

తోటివారితో మంచిగా జీవించు.ఒకసారి ఒకరితో

స్నేహం చేసాక అది కలకాలం నిలిచేటట్లు చూసుకోవాలి అని సోక్రటీసు అన్నారు

దేనినైనా ఆశించబోయేముందు దానికి కావలసిన

అర్హతను సంపాదించుకోవాలి

మహనీయులవలె అశయసాధన కోసమే జీవితమని గుర్తించాలి.

సుందరీకరణ అంశాలు

1. పరిసరాల పరిశుభ్రత

2. మొక్కలు నాటడం

3. రహదారి వనాలు

4. పూలకుండీల ఏర్పాటు

5. Pole mounted చెత్త బుట్టల ఏర్పాటు

6. డా. పద్మావతి గారి సుందరబృంద కుడ్య చిత్ర కళ

డా.డీఆర్కే ప్రసాదుగారు, డా.పద్మావతిగార్ల ప్రధాన ఆశయం

మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, అదే విధంగా మన వీధి, అంతేకాదు మనం నివసించే గ్రామం లోని రోడ్లన్నీ పరిశుభ్రంగాను, దుమ్ము ధూళి లేకుండా తళతళ మెరవాలి.

మొదటి రోజుల్లో రోజూ చీపుళ్ళతో రోడ్లు శుభ్రంచేసేవారు.

తరువాత రోజుల్లో వారానికొక్కసారి ప్రధాన రహదారులన్నీ శుభ్రం చేసేవారు. డ్రైన్ బయటకు వస్తే వెనువెంటనే నీరు పారేటట్లు చేసేవారు.

ఒకనాటి సంఘటన :

ఆరోజు వేకువ 4 గం.కు రహదారులు శుభ్రం చేస్తున్నారు.

ఇంతలో బందరు రోడ్డునుండి ఓ కారు వచ్చి సెంటరులో ఆగింది.

ఓ వ్యక్తి దిగి ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు. ఏదైనా మీటింగ్ ఉందా అని. ఆయన జర్మనీ నుండి వచ్చారు.

ఇంతలో డాక్టర్ గారు వచ్చి వారికి స్వచ్ఛ చల్లపల్లి లో జరిగే కార్యక్రమాలు చెప్పి. ఊరంతా చూపించారు.

చాలా ఉత్తేజితులై వారుగూడా మాతోపాటు చీపురుతో శుభ్రంచేసి గ్రూపు ఫోటో దిగేటప్పుడు వారి ఆనందనుభూతులు తెల్పుతూ మన కోసం మనం ట్రస్టుకు రూ.5000 లు విరాళం ఇచ్చారు.

ఇలా ఎన్ని సంఘటనలో.

చల్లపల్లి ని దత్తత తీసికొన్న బుద్ధప్రసాద్ గారితో ఒక సంవత్సరం రహదారుల శుభ్రత చేస్తామని జనవిజ్ఞాన వేదిక సభ్యులు, డాక్టర్ గార్లు తెలిపారు.

200 రోజులు దాటేటప్పటికె పరిశుభ్రాతా కార్యక్రమం పూర్తి కావచ్చింది.

యం పిపి లంకబాబుగారు, యం డిఓ విద్యాసాగర్, డాక్టర్ గార్లు సమావేశమై రహదారుల శుభ్రతతో పాటు నీడనిచ్చే మొక్కలు నాటాలని నిశ్చయించారు.

మొదటి సంవత్సరం లో రోడ్లపై పాయఖానాలతో బాటు రోడ్లు దుర్గదభూయిష్టంగా ఉండేవి.

రోడ్డు మార్జిన్ లు కనబడేవి కావు. రోడ్లు గడ్డి, మట్టి తో మూసుకుపోయి ఉండేవి.

పారలు, దోకుడు పారలతో చెక్కి శుభ్రం చేయగా విశాలమైన రోడ్లు బయట పడేవి.

-ప్రాతూరి శాస్త్రి

08.09.2020.