ప్రాతూరి శాస్త్రి - 10.09.2020. ....           10-Sep-2020

 సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు.

సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు.

            డా.పద్మావతి గారు 35 దినముల తరువాత స్వచ్ఛ చల్లపల్లి లో చేరినదాది సేవతీరులో మార్పు వచ్చింది.

            మొదటిసారిగా srysp college బయట శుభ్రం చేసి పూలమొక్కలు నాటి ఉద్యానవనంగా మార్చారు.

            తదుపరి టాయిలెట్లతో నిండిన బైపాస్ రోడ్డులో బాలికల వసతిగృహం బయట శుభ్రంచేసి ఉద్యానవనం ఏర్పాటుతోపాటు ఆ సెంటరులో మూడు కమలాలనేర్పాటుచేసి పూల మొక్కలు నాటి కమలాలపై స్వచ్చాంధ్రప్రదేశ్, స్వచ్ఛ చల్లపల్లి, స్వచ్చ భారత్ అని వ్రాయించినారు.

            హిందీలో ఓ సామెత ఉంది,

            కల్ కా కామ్ ఆజ్ కరో

            ఆజ్ కా కామ్ అభీ కరో.....

            డా.పద్మావతి గారి అభిరుచి, సేవాతత్పరత ఇలాగే ఉంటుంది.

            రేపు చేద్దామన్నది ఈరోజు, ఈరోజు అనుకున్నది ఇప్పుడే చేయాలి. ఈ తపనే స్వచ్ఛ సుందర చల్లపల్లి కి గొప్ప వరం అయింది.

            అదే బస్టాండ్ రహదరివనం, సుందరీకరణ,

            నాగాయలంక రోడ్డులో గురవయ్య గారి సోదరుల ద్రవ్యము తో బ్రహ్మంగారి గుడి దాటాక ఎడమవైపు రహదారివనం ఏర్పాటు.

            అన్నిరకాల పూల మొక్కలతో విరాజిల్లుతూవుంటుంది.

            బయట బిళ్ళగన్నేరులు స్వాగతం పలుకుతుంటాయి.

- ప్రాతూరి శాస్త్రి

10.09.2020