ప్రాతూరి శాస్త్రి 26.09.2020. ....           26-Sep-2020

 ఆచరణ పరులుగారే  పరహితార్థ చరణమతులు

133 వ రోజు.

          హైదరాబాద్ లోని సన్ షైన్ హాస్పిటల్ అధినేత డా. గురవారెడ్డి గారు, MBBS లో డా.డీఆర్కే ప్రసాదుగారికి జూనియర్, డా.పద్మావతి గారి క్లాస్ మేట్, చల్లపల్లి దర్శనార్థం విచ్చేసారు.

           గ్రామంలో జరుగుతున్న సేవలు పరిశీలించి చెత్త తీసికొని వెళ్లుటకు రూ5,00,000 లు విలువైన  Tata ace ని విరాళంగా ఇచ్చారు.

          కాలాంతరాల్లో అది స్వచ్ఛ చల్లపల్లి కి ఎంతో సేవ చేసింది.

          గ్రామంలోని 5 వార్డులలోని చెత్తను దానిలో తీసికొనివెళ్లి డంపింగ్ యార్డులో తరలించేవారు.

            మరుసటి రోజు కార్యకర్తలందరకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

            నిరాడంబరుడు, తీయగా మాట్లాడుట, అందరినీ ప్రోత్సహించుట, పరిశోధన, ధైర్యసాహసాలు వారి వ్యక్తిత్వ వికాసం.

              మన కోసం మనం ట్రస్టు చైర్మన్ గా వ్యవహరిస్తూ స్వచ్ఛ సుందర చల్లపల్లి కి backbone గా వుంటూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

             డా.గురవారెడ్డి గారు, డా.గోపాలం శివన్నారాయణ గార్ల రాక కార్యకర్తలలో ఎనలేని ఉత్సాహం వస్తుంది. వారి ప్రసంగం మహిమ అలాంటిది.

                 142 వ రోజు

              02.04.2015

 

ముత్యంలా మెరిసిపడే స్వచ్ఛమైన భారతం

పరిశుభ్రత విరబూసే పరిమళాల నందనం

అభ్యుదయం హరివిల్లై ఆనందం విరిజల్లై

స్వచ్ఛ భారతం వందేమాతరం.

 

పాట వినసొంపుగా ఉందేమో తన్మయత్వం తో వింటున్నారు కొంతమంది కార్యకర్తలు.

ఆరోజు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ బాడిగ రామకృష్ణ గారు, మచిలీపట్నం, చల్లపల్లి చూడడానికి వచ్చారు.

 స్వచ్ఛ చల్లపల్లి లో జరుగుతున్న పరిశుభ్రతాకార్యక్రమం చూచి ఆనందించారు.

 అనంతరం ఆసుపత్రి సిబ్బంది, కొంతమంది కార్యకర్తలు సభలో పాల్గొన్నారు

 

" వృక్షో రక్షతి రక్షతః, "

            హరిత చల్లపల్లి

మేము నివసించే గ్రామం సర్వ సమృద్ధిగా ఉండాలి, పరిశుభ్రతకు మారుపేరు మా చల్లపల్లి యని తలచినవారై డా.డీఆర్కేప్రసాద్, డా.పద్మావతి గార్లు తమ కార్యకర్తల30.05.2015తో కలసి అద్భుతాలు చేస్తున్నారు

అద్భుతాలను చూడాలని తహతహలాడే మనసుకు వాటిని చూసేటప్పుడు ఎంత సంతోషం.

పౌరునిగా నైతికాభివృద్ధిని సాధించినపుడే నిజమైన దేశాభివృద్ధి సాధించినట్లు.

 

                   30.05.2015

భూమిని తట్టి లేపునది అరుణ మయూఖము. హృదయము తట్టి లేపునది సేవామయురము.

              వేకువసేవకు 200 రోజులు.

శ్రీ బుద్ధప్రసాద్ గారు, కూచిభొట్ల ఆనంద్ గారు,సిలికానాంధ్ర వ్యవస్థాపకులు, డా.పి.వి.రాజు, స్వీడన్, డా.గోపాలం శివన్నారాయణ గారు, mpp. లంకబాబు గారు, జడ్పిటిసీ కృష్ణకుమారి గారు పాల్గొన్నారు.

కీర్తి హాస్పిటల్ నుండి రాలీగా బయలుదేరినారు. బైపాస్ రోడ్డునుండి రాధానగర్ మీదుగా ఉర్దూ పాఠశాల, నారాయణరావు నగర్ నాలుగురోడ్ల సెంటరు, విజయవాడ రోడ్డు నుండి ఆస్పత్రికి చేరారు.

              చిత్రం ఏమిటంటే 

సభావేదిక రాలీ కాగా, వక్తలు నినాదాలతో పాటు ప్రసంగాలు గూడా చేశారు. 

  రాలీ లొనే బాలికల హాస్టల్ వద్ద మొక్కలు నాటారు.

విశేషం ఏమిటంటే ప్రతి ర్యాలీకి ప్రభాకర్ మాస్టారు వద్ద ఇంజనీరింగ్ విద్యార్థులు డప్పు కళాకారులు , ప్రదర్శనలో పాల్గొని ప్రజలను, కార్యకర్తలను ఉత్సాహపరిచేవారు.

 

ప్రాతూరి శాస్త్రి

26.09.2020