ప్రాతూరి శాస్త్రి 27.09.2020....           27-Sep-2020

దేశసేవ కన్న దేవతార్చన లేదు               

278 వ రోజు

16.08.2015

   కలలు అందరూ కంటారు. కొంతమంది వాటిని సాకారం చేసుకొంటారు. అందునా సమాజశ్రేయస్సుకై కన్న కలలు సాకారమౌతుంటే ఆనందం వర్ణనాతీతం.           

మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనకళ్ల నారాయణ గారు చల్లపల్లి లో పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం చూడడానికి విచ్చేసారు.

  వరుణుడు పులకించి జల్లులు కురిపించాడు. అయినా మన కార్యకర్తలు:

  చలికి వరుణుడు పులకించి జల్లులు కురిపించాడు. అయినా మన కార్యకర్తలు:

          చలికి వణకరు

          వడగాలికి జంకరు

          జలధారలకు బెదరరు

ఏ ఋతువైన సమముగా సేవ చేయుదురు.

    కార్యకర్తలు, ఎంపీ నారాయణగారు, ఎంపిపి లంకబాబు గారు, zptc గారు, సర్పంచ్ గారు గ్రామాధికారులు రాలీలో పాల్గొన్నారు.  దారిలో మొక్కలు నాటారు.

గౌడపాలెం రామాలయం వేదికగా సభజరిగింది.

 

288 వ రోజు 

26.08.2015

 

ఈసమాజంలో మనగలగాలంటే సరైన మాటను సరైన సమయంలో సరైన గొంతుక సరైన వ్యక్తితో

మాట్లాడగలగాలి.  మనిషి మరోమనిషికి సాయపడాలి, మనగ్రామానికి మనమే సాయం చేయాలి.

 

             ఓ మహత్తరమైన రోజు.

నీటిపారుదల శాఖామంత్రి, ఆరోగ్యశాఖామంత్రి గార్ల చల్లపల్లి పర్యటన. యధావిధిగా రాలీ, కీర్తి ఆసుపత్రి నుండి ప్రభుత్వ వైద్యశాల వరకు.

 ముందుగా వచ్చిన ఆరోగ్యశాఖామంత్రి గారు కామినేని శ్రీనివాస్ గారు కార్యకర్తలను పేరుపేరునా అభినందించారు.

పార్లమెంటు సభ్యులు దేవినేని ఉమ గారు కార్యకర్తలను పలకరించారు.

 ప్రభుత్వ వైద్యశాలలో మొక్కలు నాటారు. Photo exhibition దర్శించి ఆనందపడ్డారు.

ప్రాతూరి శాస్త్రి

27.09.2020