ప్రాతూరి శాస్త్రి - 30.09.2020.....           30-Sep-2020

చారిత్రిక ప్రదేశాల దర్శనం భారతీయ సంస్కృతి పట్ల గౌరవం, మానసిక వికాసం కలుగుతుంది. 

740 వ రోజు 20.11.2016

            స్వచ్చ సుందర చల్లపల్లి ప్రారంభం నుండి ప్రతి సంవత్సరం నవంబరులో ఓ విజ్ఞానయాత్ర నిర్వహించడం జరుగుతున్నది.

            ఉదయం 7 గంటలకు 45 మంది కార్యకర్తలు బస్సులో బయలుదేరి విజయవాడ భవానీ ద్వీపానికి వెళ్లాము. 

            ఉదయం 10 గంటలకు విజయవాడలో పున్నమి ఘాట్ చేరాము. అల్పాహారం స్వీకరించిన పిదప మోటార్ బోటులో భవానీ ద్వీపం చేరాము.

            కార్యకర్తల అనందహేల. ద్వీపంలో ఏర్పాటుకాబడ్డ వూయలలు ఊగారు. రైలుబండి ఎక్కి దృశ్యములు వీక్షించారు. ఒకచోట నృత్యములు, మరోచోట మిమిక్రీ, ఇంకోచోట కార్యకర్తల ఆటలు, జోకులు, ఏకాపాత్రాభినయాలు ఫోటోలు దిగడాలు. ఎంతో ఉల్లాసంగా గడిచింది.

విభిన్న కార్యక్రమాలలో పాల్గొన్నారు.

కార్యకర్తల ఆనందఆదివారం దిగ్విజయంగా సాగింది.

సాయంత్రము 4 గం కు తిరుగుప్రయాణం.

మధురానుభూతులతో 8 గంటలకు చల్లపల్లి చేరాము.

- ప్రాతూరి శాస్త్రి

30.09.2020.