ప్రాతూరి శాస్త్రి - 01.10.2020. ....           01-Oct-2020

 క్రమశిక్షణాయుత పారిశుద్ధ్య వ్యవస్థ : 05.12.2015

            గత 6 నెలల నుండి చల్లపల్లిలోని 18 వార్డులలో 5 వార్డులను మనకోసం మనం ట్రస్టుతరుపున ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి చెత్త నిల్వకేంద్రానికి (Dumping yard) పంపడం జరుగుతోంది.

            చల్లపల్లి మొత్తం అన్ని వార్డులను, ముఖ్య రహదారులను(main road – market area) రోజూ శుభ్రం చేయడానికి గ్రామ పంచాయితి పాలకవర్గంతో ట్రస్టు ఒక ఒప్పందం కుదుర్చుకున్నది.అందులో భాగంగా వ్యాపార కూడలి ప్రాంతాన్ని మన కోసం మనం ట్రస్టు, మిగిలిన 13 వార్డులను గ్రామ పంచాయితి శుభ్రం చేయడానికి నిశ్చయించుకున్నవి.

            డిసెంబర్ 1, 2015 నుండి ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, రాత్రి 8 గంటల నుండి 12 గంటల వరకు గ్రామ పంచాయితి వారిచ్చిన 6గురు పారిశుధ్య కార్మికులతో పాటు స్వచ్ఛ కార్యకర్తలు అత్యంత క్రమ శిక్షణతో మార్కెట్ ఏరియా లో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు పంపుతున్నారు. 3 రోజులకే చల్లపల్లి రోడ్లు చెత్త రహితంగా, సుందరంగా కనిపిస్తున్నాయని ప్రశంసలు వచ్చాయి.

            2016 లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. గోపీచంద్ గారు మన కోసం మనం ట్రస్టుకి ట్రాక్టర్ ఇంజన్ కై విరాళమిచ్చారు.        

            2017 లో శ్రీ ముమ్మనేని రాజశేఖర్(నాని గారు) డా. గోపాలకృష్ణయ్య గారు ఉత్సాహపరచగా ట్రాక్టర్ కి వెనుక వుండే ట్రక్ విరాళంగా ఇచ్చారు.

            అప్పటి వరకు 5 వార్డులలోని చేత్త సేకరణకు టాటా ఏస్ వెళ్ళేది.

            కోమలానగర్, నారాయణరావు నగర్ లోని స్థానికులు చెత్తబండి కావాలని కోరగా డా.గోపాలకృష్ణయ్య, సజ్జాప్రసాదు గారు, జనార్దన్ గారు, అర్జునరావు, బృందావన్, నేను కోమలనగర్ నారాయణరావు నగర్ లలో చెత్తబండి ఏర్పాట్ల గూర్చి తెలుపుటకు యింటింటికీ తిరిగి కౌన్సిలింగ్ ఇచ్చినాము.

            నవంబర్ నుండి ఉదయం 7 గంటల నుండి 11గంటల వరకు నారాయణరావు నగరులోనూ, సాయంత్రం 3.30 నుండి 6.30 వరకు కోమలానగర్ లోను చెత్త సేకరణకు ట్రాక్టర్ వెళ్ళేది.

            ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు నియమించిన నియమాలకు ధీటుగా ఒక క్రమశిక్షణతో జరిగేది.  

            ప్రతిరోజూ ఒక బజారులో ఒక సెంటరులో ఒకే సమయానికి చెత్త బండి వెళ్ళేటట్లు ఏర్పాటు చేశారు.

          తరువాత రోజుల్లో తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి ఇచ్చేవారు. తద్వారా వర్మీ కంపోస్టు తయారుచేసేవారు.

            స్వఛ్ఛఆంధ్ర కమీషన్ వారు పంచాయతీలకు రిక్షాలు, కార్మికులను ఇవ్వగా ఈ వ్యవస్థను పంచాయితీ కి తరలించారు.       

            పూర్వపు రోజుల్లో నిత్యమూ వెళ్లే చెత్తబండి ప్రస్తుతం రెండు రోజులకోసారి చెత్త సేకరణ చేస్తోంది.

            మొక్కవోని దీక్షతో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు అభినందనీయులు.

- ప్రాతూరి శాస్త్రి

01.10.2020.