ప్రాతూరి శాస్త్రి - 02.10. 2020.....           02-Oct-2020

సంస్కారవంతమైన నమస్కారముతో మొదలైనదీ ఉద్యమం.

 

ఇంతింతై వటుడింతింతైన చందాన వృద్ధి చెందినదీ ఉద్యమం.

కేవలం రహదారి శుభ్రతకే పరిమితముకాక మురుగుకూపాలసైతం పరిశుభ్రత కావించిన ఉద్యమం. 

వేకువ సేవకే ప్రాధాన్యతనిచ్చి సామాజిక చైతన్యాన్ని కలిగించిన ఉద్యమం.

సుందరీకరణే గ్రామ ప్రగతికి మూలమని డా. పద్మావతి గారు మొదలిడిన సుందర వుద్యమం.

 

గ్రామ సరిహద్దులు దాటి సమీప గ్రామాలను చైతన్యపరచిన ఉద్యమం.

గ్రామనలుదెసల మొక్కల నాటి రహదారుల శోభను పెంచిన ఉద్యమం. 

దివిసీమకే తలమానికం తరిగోపుల ప్రాంగణం.

ఎంతటి కసాయినైనా, రోగినైనా ఆహ్లాదపరిచేటట్లు చేయగలిగిన ఉద్యమం.

డా. డీఆర్కేప్రసాదు గారు, డా.పద్మావతి గార్ల సహనం, సాహసం పుణికిపుచ్చుకొని కార్యకర్తలు తమదైన శైలిలో సాగిస్తున్న మహోద్యమం ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం.

స్వచ్ఛ సుందర చల్లపల్లిని అనేక ప్రముఖులు సందర్శించారు. వారిలో కొందరి పరిచయాలు చేసుకుందాము.

21.11.2016 న స్వచ్ఛ సుందర చల్లపల్లిని సందర్శించుటకు మద్దుకూరి సుబ్బారావు గారు Solid waste management advisor vijayawada, Redcross president, Gannavaram, డా.యం.విజయకమార్ గారు, మాధవిగారు Secretary, Redcross వచ్చినారు వారి మాటలలో పేపరులో చల్లపల్లి గురించి చదివి చూడటానికి వచ్చినాము. పేపరు వార్తలకన్న ఎంతో సుందరంగా వున్నదని, ఏబజారులో వెతికినా కారీబాగులు కనపడలేదని తెలిపినారు.

చల్లపల్లిలో చెత్తబండి వారిని, పంచాయితీ ట్రాక్టరు కార్మికులతో మాట్లాడి వారి పనితీరును పరిశీలించి ఆనందపడినారు.

గ్రామంలోని ఉద్యానవనాలను ఆసక్తితో చూచినారు.

డంపింగుయార్డు విశేషాలు తెలుసుకున్నారు

రధసారధులతో ఒక మంచి పరిశుభ్రమైన ఊరిని చూసామని ఎంతో ఆనందం వ్యక్తం చేసారు.

మీ ఊరికి డంపింగుయార్డు అనుమతిరాగానే తెలిపినట్లైతే చాలా తక్కువ ఖర్చుతో డంపింగుయార్డు వర్మి కంపోస్టు తయారీ

ఏర్పాటుచేస్తామన్నారు.

వారు నలగురితో గడిపిన మాఅందరికీ చాలా సంతోషం గా వుంది

శ్రీ M.V.సుబ్బారావు గారు ఆనాటి నుండి చల్లపల్లి పై ప్రేమ, అభిమానాలతో  మన కార్యక్రమాలను చూస్తూ , అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు. వారు చల్లపల్లి లో లేకపోయినా వారి మాటలలో "నేను స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తను" అనే అందరికీ చెపుతారు.

- ప్రాతూరి శాస్త్రి

02.10. 2020.