ప్రాతూరి శాస్త్రి - 03.10.2020. ....           03-Oct-2020

 పుష్ప సౌరభమును దారము పొందినట్లు

స్వచ్ఛ సుందర చల్లపల్లి సొగసు దశదిశలా వ్యాపించింది.

 

"స్వచ్ఛ భారత్ అంటే తప్పుచేసి సారీ చెప్పడం కాదు, ఆచరించి చూపాలి"

                  .........

       స్వచ్ఛ నారాయణరావు నగర్

                  ........  

        1000 రోజుల స్వచ్ఛ సుందర చల్లపల్లి వేడుకలకు ఆహూతులైన నారాయణరావు నగర్ వాస్తవ్యులు నబీ ఘోరీ, గఫార్ లకు జనించినది. మనమూ నారాయణరావు నగరులో నూ సేవాబాధ్యత లు ఎందుకు చేయరాదు అన్న తలపు అఖండంగా 600 రోజుల సేవాప్రయాణం అద్భుతంగా సాగింది.

           

            ఎక్కువ మంది ముస్లిం కార్యకర్తలే అందునా మహిళలు, పిల్లలు గూడా పాల్గొనడం విశేషం.

            6 వ నంబరు కాలువకు ఎగువ భాగం ప్రతి సందు పరిశుభ్రం చేశారు.

       

1141 వ రోజు సుందర చల్లపల్లి 26.12.2017

సుందర చల్లపల్లి లో విశేషంగా చెప్పుకునేది నారాయణరావు నగర్.

నారాయణరావునగరులో సేవాకార్యక్రమాలు మొదలిడి 100 రోజులైన సందర్భంగా కార్యకర్తలందరూ రాలీ గా నారాయణరావు నగరులో నినాదాలతో పయనించారు.

           

            తరువాత 100రోజుల పండుగగా కేకు కోసి ఆనందాలు పొందినారు

           

            చల్లపల్లి లోని ప్రతి వార్డులోనూ ఈవిధంగానే ప్రజలచే సేవాకార్యక్రమాలు నిర్వహించే రోజు త్వరలోనే ఉందని డా.డీఆర్కేప్రసాద్ గారు అన్నారు.

 

            జై స్వచ్ఛ సుందర చల్లపల్లి, జై స్వచ్ఛ సుందర నారాయణ రావునగర్ అనే నినాదాలతో ఆప్రాంతం మారుమ్రోగింది.

 

1241 వ రోజు స్వచ్ఛ నారాయణరావు నగర్ 05.04.2018.

 

సేవ చేయాలనే సంకల్పం ప్రతివారికీ ఉంటుంది

ఆచరణాత్మకంగా ఎప్పుడు మారుతుంది చెప్పలేము.

ఒక్కసారి సేవాభిలాష కలగాలే గానీ బయటకు

రావడం ఎవరితరం గాదు.

సేవాకార్యక్రమాలు ఎంతమంది చేస్తున్నారనేది

ప్రశ్నగాదు ప్రతిరోజు ఎవరువస్తే వారు నిరాశపడకుండా సేవజేయడం ముఖ్యం.

అటువంటి కోవకు చెందినవారే నారాయణరావు నగరు లోని సేవచేసే కార్యకర్తలు.

ఈనాటికీ 200 రోజులు. క్రమం తప్పకుండా సేవచేస్తున్నారు.

ఈరోజు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు నారాయణరావు నగర్ కార్యకర్తలు. అంగన్వాడీ పాఠశాల నుండి కార్యకర్తలందరు కలసి వీధులలో పాదయాత్ర చేశారు.

200 రోజుల చరిత్ర, నినాదాలు, స్వచ్ఛ సుందర చల్లపల్లి మధురస్మృతులతో నారాయణరావు నగరు మారుమ్రోగింది.

దారిలో గాంధీగారి విగ్రహానికి డా.పద్మావతి గారు పూలు సమర్పించారు.

అంగన్వాడీ పాఠశాల వద్ద సమావేశం అయినారు.

యోగామాష్టారు వెంకటేశ్వరరావు గారు చక్కగా సమావేశం నిర్వహించారు.

ఈ.ఓ.ప్రసాద్ గారు సేవాకార్యక్రమాల గూర్చి వివరించారు.

రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామారావు గారు నారాయణరావు నగర్ కార్యకర్తల సేవలను పద్యరూపంలో తెలియజేసారు.

 

            స్వచ్ఛ నారాయణరావు నగరులో 300 రోజుల (14.07.2018) కార్యక్రమంలో కార్యకర్తలు ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంచారు.

 

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమం 500* వ రోజు

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1541*వ రోజు

 

            ఉదయం 5:15 నిముషాలకు కార్యకర్తలందరూ తమ్మన ప్రసాద్ గారి ఇంటి వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్దకు కార్యకర్తలు చేరుకున్నారు. 5.30 గంటలకే బుద్ధ ప్రసాద్ గారు, లంకబాబు గారు విచ్చేశారు. గాంధీ విగ్రహానికి దండలు వేసిన అనంతరం జరిగిన సభలో గాంధీజీ స్మృత్యర్ధం ఒక నిముషం మౌనం పాటించారు. 500 రోజుల నుండి విరామం ఎరుగకుండా స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కార్యకర్తలను బుద్ధ ప్రసాద్ గారు అభినందించారు. తమ్మన ప్రసాద్ గారు చేసిన ఏర్పాట్లను అభినందించారు.

 

            హైదరాబాదు నుండి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మాలెంపాటి రామకోటేశ్వరరావు గారి కుమారుడు మాలెంపాటి శరత్ గారు 1,000/-, శరత్ గారి కుమారుడు మాలెంపాటి చిరుతేజ తాను దాచుకున్న 100/- రూపాయలను, కటకం సూర్యనారాయణ, నిర్మలాదేవి దంపతులు 2,000/-, స్వచ్ఛ నారాయణరావు నగర్ వాస్తవ్యులు 2,000/- స్వచ్ఛ చల్లపల్లి అభివృద్ధి కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం అందచేశారు. వీరికి స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.

 

            నారాయణరావునగర్ వాస్తవ్యులు రాత్రంతా కష్టపడి ఆ రోడ్డంతా ఎంతో సుందరంగా ముగ్గులు వేశారు. నారాయణరావునగర్ కార్యకర్తలు అందరికీ కేకులు పంచిపెట్టారు. 

 

            ఈ కార్యక్రమం అనంతరం కార్యకర్తలందరూ గాంధీ స్మృతివనం వద్దకు చేరుకుని అక్కడ జరిగిన సర్వమత ప్రార్ధనలో పాల్గొన్నారు.

           

            600 రోజులు సేవ తరువాత మహిళలు అనివార్యకారణాల వల్ల రాలేకపోయారు.

           

            కొద్దిరోజులకు కార్యకర్తలు విభిన్న ఉద్యోగాలలో చేరుట వల్ల తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది.

 

- ప్రాతూరి శాస్త్రి

03.10.2020.