ప్రాతూరి శాస్త్రి - 06.10.2020. ....           06-Oct-2020

 స్వచ్ఛ సుందర టాయిలెట్ తో సెల్ఫీ దిగిన కలెక్టర్ లక్ష్మీకాంతం గారు

            ఆత్మగౌరవ దీక్షలో భాగంగా  (07-01-2018) ‘టాయిలెట్ తో సెల్ఫీకార్యక్రమం ఉంది, కలెక్టర్ గారు చల్లపల్లిలో సెల్ఫీ దిగాలని అనుకుంటున్నారని MRO బిక్షారావు గారు చెప్పారు.

            కార్యకర్తలు, పంచాయతీ అధికారులు, పాత్రికేయులు, యం. డీ.ఓ. గారు, యం. ఆర్.ఓ గారు, మధ్యాహ్నం 2గం. కే వచ్చారు.

            వేచిచూడడంలో గూడా మజా ఉంటుంది.

            ఎట్టకేలకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కలెక్టర్ గారు వచ్చారు. రాగానే టాయిలెట్ ఎక్కడ?’ అని అడిగారు. సర్, ఇదే టాయిలెట్అని మన పబ్లిక్ టాయిలెట్ ని చూపించటం జరిగింది. ఆ తరువాత టాయిలెట్ లోపలంతా చూసి మన ఇంట్లో ఉన్నట్లే ఉంది కదా! ఎలా నిర్వహిస్తున్నారు?’ అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పబ్లిక్ టాయిలెట్లను SRYSP కాలేజీ ప్రాంతంలోను, సెంటర్ లోను కట్టగలిగితే ఈ ఊరికి ఇక పబ్లిక్ టాయిలెట్ సమస్య ఉండదుఅని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆ ప్రాంతాలలో స్థలం చూపిస్తే ఇలాంటి పబ్లిక్ టాయిలెట్లను మనకోసం మనంట్రస్ట్ తరఫున కట్టగలంఅని కూడా చెప్పడం జరిగింది.

            ఆ తరువాత స్వచ్ఛ సుందర టాయిలెట్తో కలెక్టర్ గారు ఫొటో దిగడం జరిగింది. కార్యకర్తలు, అధికారులు, ఉపాద్యాయులు, విద్యార్థులందరితో కలెక్టర్ గారు ఫోటోలు దిగారు.

            రెండు నెలల క్రితం డా. పద్మావతి గారు నాగాయలంక రోడ్డులోని టాయిలెట్ తో సెల్ఫీ దిగడం చూసి టాయిలెట్ కి ఏక్ ప్రేమ్ కహానీఅని సరదాగా డా.డీఆర్కే గారు రాసిన ఒక ARTICLE ను వారికి ఇవ్వడం జరిగింది.         

            కలెక్టర్ లక్ష్మీకాంతం గారు చాలా ఆనందించారు.

- ప్రాతూరి శాస్త్రి

06.10.2020.