ఆకుల దుర్గాప్రసాద్....           06-May-2020

2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర - 3

స్వచ్చ సుందర చల్లపల్లి” ఉద్యమం మీద నా స్పందన

నా పేరు ఆకుల దుర్గాప్రసాద్

ముందుగా స్వచ్ఛ సుందర చల్లపల్లి సుదీర్ఘ ఉద్యమానికి, ఉద్యమ కార్యకర్తలకు 2000 వ రోజు శుభకాంక్షలు.

సుమారు గా 900 వ రోజుల నుండి నేను, మా నడక సంఘం మిత్రులు స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం లో పాల్గొంటున్నాము.

అంతకు ముందు మేము SRYSP కాలేజీలో వాకింగ్ చేస్తుండే వాళ్ళం. అప్పుడు మాకు రెండు వారాలకు ఒక రోజు స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో లో పాల్గొనాలనే ఆలోచన వచ్చింది.

ఆ తరువాత వాకింగ్ చేస్తే నా ఒక్కడి కే లాభం, కానీ స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో ప్రతిరోజూ పాల్గొంటే ఎంతో కొంత మన ఊరి మొత్తానికి ప్రయోజనంగా ఉంటుంది కదా అనే ఆలోచన వచ్చి, అప్పటినుండి సాధ్యమైనంతవరకు క్రమం తప్పకుండా వస్తున్నాను. ఇన్ని వందల రోజుల స్వచ్చోద్యమ కార్యకర్తల నిర్విరామ కృషిని చూస్తూ, ఆనందిస్తూ, అనుసరిస్తున్నాను.

ముఖ్యంగా నిస్వార్థపరులైన ఈ ఉద్యమ రథసారథుల సహచర్యంలో పనిచేయటం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ 900 రోజుల గ్రామ మెరుగుదల కృషిలో నన్ను ఎక్కువగా ఆకర్షించిందీ, ఆసక్తి తో నేను నిర్వహించింది గ్రామ ప్రధాన వీధుల గోడల మీద రంగులతో బొమ్మలు వేయడం, ప్రయోజనకరమైన నినాదాలను రాయడం, వీటికవసరమైన రకరకాల సరంజామాలను ఏరోజుకారోజు సిద్ధం చేసుకోవడం, సృజనాత్మకంగా ఎన్నో కార్టూన్లను ప్రముఖ ప్రదేశాలలో చిత్రించడం!   

నిస్వార్ధంగా పనిచేసే నాతోటి కార్యకర్తలతో కలిసి పని చేయడం కూడా నాకెంతో ఉత్తేజంగా ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్ గారి అభ్యుదయ భావాలు, మేడం గారి వినూత్న ఆలోచనలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారి వెనుకనే నా భవిష్యత్ స్వచ్ఛ సుందర చల్లపల్లి గమనం అని విన్నవిస్తూ –

ఆకుల దుర్గాప్రసాద్

02.05.2020.