బాణావతు రాజు (బెంగళూరు)....           08-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు –

 కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 5

ప్రపంచమంతటా ..... ఒక పంథాలో...

ప్రజాగణమంతా .... ప్రకృతి వ్యధలో ....

శుభ్రంగా ఉండవోయ్ .... పరిశుభ్రంగా మసలుకోవోయ్ ...

అని సూచనలు ఇస్తుండగానే ...

వ్యర్ధ దుర్గంధాలతో ... రోగాలను పుట్టిస్తూ ..

ఎన్నటికీ వీడని రుగ్మతలతో పీడిస్తూ ...

వ్యవస్థ అతలాకుతలం అవుతున్న తరుణంలో...

“స్వచ్ఛ భారత్” స్ఫూర్తితో – పునః ప్రేరణ నుండి....

ప్రేరణనొంది ... సహృదయకాంక్షను నింపుకొని ...

ప్రజాక్షేమం ... మన సంక్షేమం ...

మన ఊరూ .. మన ఆరోగ్యం ...

అంటూ నాడు (12.11.2014) మొదలైన ఆ “దాసరి” వీరుని తొలి అడుగు ...

 

           స్వచ్చోద్యమ చల్లపల్లి!   

 

వడివడిగా మొదలై ...

కొనసాగుతూనే ఉన్నది ఓ సంచలన నడవడికగా .... తెలియక తుదులు ...

ఆరోగ్యాన్ని .... ఆనందాన్ని పంచుతూ ...

సమాజం పట్ల బాధ్యత ... భరోసా నింపుతూ ...

ఎన్నో ఆశలు ... ఆశయాలు దాటుతూ ....

వివిధ రంగాలలోని ప్రఖ్యాత వ్యక్తుల ప్రశంసలు పొందుతూ...

అందరి అభిమాన తరంగాలతో .... మరింత ఉత్తేజం పొంది ...

ఉన్నత సంస్థ ... ఐక్యరాజ్య సమితి లో కూడా ... మిక్కిలిగా నిలిచి స్ఫూర్తి నింపి...

అనేకానేక సామాజిక మాధ్యమాల్లో .... పంచుకొని ... ఖ్యాతిని పెంచుకొని ...

“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు”

అనే నానుడికి నిజరూపాలై ... స్వరూపాలై ...

స్వచ్చ సుందర సైనికులందరూ ... చేయి చేయి కలుపగా ...

ఒక్కటే నినాదంతో నిలువగా ...

యావత్ ప్రపంచ పటంలో ...

:- స్వచ్చ సుందర చల్లపల్లి :- ని తీర్చిదిద్దిన ..

స్వచ్చమైన సైన్యానికి ... నిక్కచ్చిగా నిలిచిన సేవాగణానికి ..

2000 వ రోజుల నిరంతర సేవా ప్రయాణానికి శుభాకాంక్షలు ... తెలియజేస్తూ ...

“మన అడుగు ముందుకే ... మనమున్నది అందుకే”

అనే ప్రేరణతో....  

బాణావతు రాజు (బెంగళూరు)

(స్నేహ మెడికల్స్ రమేష్ గారి తమ్ముడు)

02.05.2020.