కస్తూరి వారి సంస్మరణ కార్యక్రమం ....           03-May-2026

 స్వచ్ఛ సుందర చల్లపల్లిలో మరొక ప్లాస్టిక్ రహిత కార్యక్రమం

               ఆ వేడుకకు కారకులు చల్లపల్లి వాస్తవ్యులు, దివంగత కస్తూరి కృష్ణమూర్తి గారి వారసులు అయిన శ్రీనివాస్, విజయ్ లు.

               ఈ ఆదివారం సాగర్ టాకీస్ ప్రాంతంలోని తమ ఇంటి వద్ద జరిగిన తమ తండ్రి గారి సంస్మరణములో, భోజనాలలో ఏ సింగిల్ ప్లాస్టిక్ కూడ కనిపించలేదు.

               ఈ ఆదర్శ కార్యక్రమాన్ని నిర్వహించిన కస్తూరి సోదరులు, కుటుంబీకులు ప్రశంసార్హులు. ఇలాంటి పర్యావరణహితమైన కార్యక్రమాలే ఇకముందు ఈ గ్రామంలో జరగాలనీ, ఈ గ్రామం వేలాది ఊళ్లకు మార్గదర్శకం అవుతుందనీ ఆశిద్దాం.

- నల్లూరి రామారావు

    03.05.2026