పర్యావరణ హితంగా రామకృష్ణ గారి సంస్మరణ కార్యక్రమం....           19-Jul-2026

 పర్యావరణ హితంగా రామకృష్ణ గారి సంస్మరణ కార్యక్రమం

మేకావారిపాలెం కు చెందిన కొడాలి రామకృష్ణ గారు వయోభారంతో ఇటీవల తనువు చాలించారు.

నేడు వారి పెద్దకర్మ కార్యక్రమం జరిగింది.

ఆ కార్యక్రమంలో…

ఫ్లెక్సీ వేయించలేదు.

-వస్త్ర బ్యానరే రాయించారు.

భోజనానికి సాంప్రదాయక కుట్టు విస్తరాకులు,

త్రాగునీటికి పేపర్ గ్లాసులు వాడారు.

ఆరోగ్యానికి ప్రమాదకరమైన,ఇటీవల బాగా అలవాటుగామారిన Cola డ్రింకులు ఇవ్వలేదు.

ఒక్కసారికే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులేవీ వాడకుండా Eco-friendly గా నిర్వహించిన వారి కుమారుడు కొడాలి రవి, కుటుంబసభ్యులు, బంధు మిత్రులు అభినందనీయులు.

- డా. డి ఆర్ కె ప్రసాదు

   19-07-2026