హరిత వేడుకగా సంస్మరణ సభ
చల్లపల్లిలోని స్వచ్చోద్యమ అభిమానులు విజయలక్ష్మి మెడికల్ షాపు వెంకటేశ్వరరావు, అమెరికాలో ఉంటున్న రామగోపాల్, నళినీ కుమార్ గార్లు వారి తండ్రి “వూడత్తు రామారావు” గారి సంస్మరణ కార్యక్రమాన్ని “స్వచ్ఛ సుందర చల్లపల్లి” ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు వైశ్యా బజారు లోని ‘శ్రీ ఆర్య వైశ్య సంఘ భవనం’ నందు పూర్తి హరిత వేడుకగా నిర్వహించారు.
1. అతిధులను ఆహ్వానించడానికి గుడ్డ బ్యానర్ ను రాయంచారు.
2. భోజనాలకు స్టీలు పళ్ళాలను, రెమ్మ విస్తర్లను ఉపయోగించారు.
3. మంచినీళ్ళను స్టీలు గ్లాసులలో, పేపర్ గ్లాసులలోనూ ఏర్పాటు చేశారు.
4. ఎక్కడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు కనిపించనే లేదు.
పూర్తి హరిత సంస్మరణ సభను నిర్వహించిన వీరికి స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.
- నల్లూరి రామారావు
18.01.2026.