09.04.2022 (పాట)....           09-Apr-2022

 

స్వచ్ఛ – శుభ్రతలు వికసించే- చల్లని పల్లే నా గ్రామం

శ్రమ సంస్కృతితో విలసిల్లే – జవ సత్త్వములే నా గ్రామం

రెండు వేల ఐదొందల రోజుల – నిండు త్యాగమే నా గ్రామం

స్వయం కృషికి నిలువెత్తు సాక్ష్యముగ- ప్రభవించినదే నా గ్రామం

 

                         స్వచ్ఛ శుభ్రతలు వికసించే – చల్లని పల్లే నా గ్రామం

                       శ్రమ సంస్కృతి తో విలసిల్లే- జవ సత్త్వములే నా గ్రామం

 

స్వచ్ఛ సైనికుల పద ఘట్టనతో – చరితార్థముగా నా గ్రామం

బ్రహ్మ ముహూర్తపు శ్రమ వేడుకతో – పరవశించునదె నా గ్రామం

శత సంఖ్యాధిక కార్యకర్తలకు- సాహస వేదిక నా గ్రామం

స్వచ్ఛ సంసృతిని దేశమంతటికి – చాటి చెప్పునదె నా గ్రామం

 

                              స్వచ్ఛ శుభ్రతలు వికసించే – చల్లని పల్లే నా గ్రామం

                       శ్రమ సంస్కృతి తో విలసిల్లే- జవ సత్త్వములే నా గ్రామం

 

శ్మశానాలనూ చెత్త కేంద్రమును- సంస్కరించునదె నా గ్రామం

వాగు వంకలను మురుగు కాల్వలను – బాగు చేసినదె నా గ్రామం

ఏడు రహదార్లు పూల వనాలతొ – తీర్చిదిద్దినది నా గ్రామం

పూల ఘుమఘుమల, హరిత మధురిమల – పూలతోట రా నా గ్రామం

 

                          

                     స్వచ్ఛ శుభ్రతలు వికసించే- చల్లని పల్లే నా గ్రామం

                     శ్రమ సంస్కృతి తో విలసిల్లే- జవ సత్త్వములే నా గ్రామం

 

 

 

వినూత్న సంస్కృతి వికాసమొందే – విశాల హృదయం నా గ్రామం

మూడు లక్షల పని గంటల శ్రమ-దాతల నిలయం నా గ్రామం

ఎడారి మధ్యన ఒయాసిస్సు వలె – వెలుగొందునదే నా గ్రామం

సమస్త లోకం సాగిలపడదగు - స్వచ్ఛ వీరులదె  నా గ్రామం

 

                     స్వచ్ఛ శుభ్రతలు వికసించే- చల్లని పల్లే నా గ్రామం

                       శ్రమ సంస్కృతి తో విలసిల్లే- జవ సత్త్వములే నా గ్రామం

 

రెండు వేల ఐదొందల రోజుల – నిండు త్యాగమే నా గ్రామం

స్వయం కృషికి నిలువెత్తు సాక్ష్యమై ప్రభవించినదే  నా గ్రామం

 

              స్వచ్ఛ శుభ్రతలు వికసించే- చల్లని పల్లే నా గ్రామం

                శ్రమ సంస్కృతి తో విలసిల్లే- జవ సత్త్వములే నా గ్రామం