30.09.2025....           30-Sep-2025

 కథాసమయం - ఫల శ్రుతి మయం

(నిన్నటి తరువాయి)

వ్యథ తీరునట్లుగా - కథలోన మలుపుగా

జరిగెనొక సంఘటన పది ఏళ్ల (12-11-14) ముందుగా.....

....కాలానుగుణమైన గ్రామ మార్పులకు జన

విజ్ఞాన వేదిక” ను సంస్ధ ముందుకు వచ్చె

చైతన్యవంతులను చేరదీసెను సంస్థ

               కథవిందువా మార్పు కథవిందువా

               నాజాతకము మార్చు కథవిందువా!

కథాసమయం - ఫలశ్రుతి మయం

తొలి ప్రయత్నముగ గంగులవారిపాలెము

బాట శుభ్రము చేసిబహిరంగ మలవిస

ర్జన నాపిపూల చెట్లను పూల చెట్లను నాటి పెంచారు

మలి ప్రయత్నం - చల్లపల్లి వీధుల సంస్క

రింపబూనితిరి నా చరిత్ర మలుపులు తిప్పి 

               కథ విందురా చరిత్రను కందురా

               కథలోన వృథ తీరి సుధ కందురా!

తెల్లవారకముందె నలుబదేబది మంది

నా ప్రతిష్ఠను పెంచ కష్టపడుతుంటారు.

నా వీధులూడ్చిచెట్లను పెంచుతుంటారు

వరపుత్త్రులగు వాళ్ల ఋణమెట్లు తీర్చెదనొ

గ్రామస్తులింకెపుడు సహకరిస్తారొ మరి!

               అనుమానములు తీర్చిఆత్మస్థైర్యము నింపు

               కార్యకర్తల శ్రమల కథవిందురా!           ॥ కథవిందురా ॥

(సశేషం)

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  30.09.2025