కథాసమయం - ఫల శ్రుతి మయం
(మళ్ళీ నిన్నటి తరువాయిగా)
కార్యకర్తల కృషిలొ కల్మషం లేదసలు
పదవులొ - ప్రతిష్ఠలో వాళ్లకక్కర లేదు
నా స్వస్తతే వాళ్ల న్యాయమగు కోరికట!
ఇకనైన ప్రజలెల్ల సహకరిస్తే చాలు
చరిత్రలో నా పేరు చిరస్థాయిగ వెలుగు
స్వచ్ఛత శ్రమ వైభవము కీర్తించరా? గొప్ప
శ్రమ సంస్కృతికి మీరు జై కొట్టరా?
కథ వింటివారి స్వచ్ఛ కథ వింటివా?
నిరవధిక శ్రమ చరిత్రను కంటిరా?
పదకొండు ఏళ్లుగా ప్రవహించుచున్న నా
స్వచ్చంద శ్రమదాన కథ వింటిరా?
* * * * * *
ఫలశ్రుతి :
ఈ కథను చదివినను - విని ఆచరించినను
వివరించినా - ప్రచారము చేసినా చాలు
మీ ఊరు బాగుపడు - ఆరోగ్యములు పెరుగు –
ఎల్లరకు మనఃశాంతి – ఎంతో లభించును!
కథమంచి దోయ్! స్వచ్ఛ కథ మంచిదోయ్!
శ్రమ సంస్కృతిని నేర్పు కథ గొప్పదోయ్!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
02.10.2025