చల్లపల్లి మరో హరిత వేడుక 🍃
స్వచ్ఛ మహిళా కార్యకర్త శ్రీమతి కడియాల భారతి గారు తన మనవళ్ళ పంచెల వేడుకను పూర్తి హరిత వేడుకగా నిర్వహించారు. “స్వచ్ఛ చల్లపల్లి” ఉద్యమం స్పూర్తితో ఎక్కడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వాడలేదు.
ఈరోజు (ది. 03.10.2025) మధ్యాహ్నం NH 216 లోని “శారదా గ్రాండియర్” వద్ద వెయ్యి మంది బంధువులు, ఆత్మీయులు హాజరై, భోజనాలు చేసిన సందర్భంలో ఎక్కడా -
* ప్లాస్టిక్ విస్తర్లు కనిపించలేదు - భోజనాలను అరటి ఆకులలోనే వడ్డించారు.
* ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా గాజు సీసాలను, పేపర్ గ్లాసులను మాత్రమే వాడారు.
* ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ స్పూన్లు ఏవీ వాడలేదు .
* అతిధులను ఆహ్వానించే బోర్డును ఫ్లెక్సీ తో కాకుండా కొబ్బరి ఆకులతో అలంకరించి దానిపై సహజమైన పూలతో అలంకరణను ఏర్పాటు చేశారు.
* స్టేజి అలంకరణలో కూడా అరటి ఆకులను, సహజమైన పూలను మాత్రమే వాడారు.
* కిళ్ళీలను ప్లాస్టిక్ కవర్లో కాకుండా చేతికే చుట్టి అందించారు. పుల్లలు కూడా చెక్కవే వాడారు.
చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల నినాదం - “ఎప్పుడైనా ఒట్టి మాటలు కాదు, ఆచరణే ప్రభావశీలంగా ఉంటుంది” అని మరొకమారు ఋజువుచేసిన కడియాల భారతి గారు , వారి కుమారుడు సురేష్, కోడలు అనూష గార్లు అభినందనీయులు.
- ప్రసాద్ వేల్పూరి
03.10.2025