చల్లపల్లిలో మరొక స్వచ్ఛ సుందర హరిత వేడుక.
ఊరికోసం సామూహిక శ్రమదానంలోనూ, సామాజిక స్పృహ లోనూ ముందు వరుసలో ఉన్నట్లే పర్యావరణ హిత హరిత వేడుకలలోనూ చల్లపల్లి ఆదర్శంగా నిలుస్తున్నది.
అసలే దాసరి వారిదొక స్వచ్ఛ కుటుంబం! దానికి తోడు స్వచ్ఛ కార్యకర్తయిన జాస్తి ప్రసాదు- దాసరి లక్ష్మీరాణి ల మనుమల నిన్నటి పంచెల వేడుక 100 శాతం పర్యావరణ మిత్రంగా జరిగింది.
ఎక్కడా ఏకమాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ వస్తువులు కనపడలేదు! కిళ్ళీ కవర్లు, ఐస్ క్రీం పుల్లలు, నీళ్ల గ్లాసులు, విస్తర్లు, పాత్రలు, ఏవీ వంక పెట్టడానికీ లేదు! గుడ్డ బ్యానర్ తప్ప ఫ్లెక్సీల గొడవే లేదు. చిన్నారులు విరాట్, శ్రేష్ఠలు కూర్చున్న వేదికను అలంకరించింది సహజ నవ్య పుష్పాలతోనే! - ప్లాస్టిక్ పూలతో కాదు.
NH 216 లోని “శారదా గ్రాండియర్” ఫంక్షన్ హాలు నిర్వహణ చక్కగా, అతిథులకు ఆహ్లాదకరంగా ఉండటం విశేషం!
ఇంత చక్కని ఆదర్శ హరిత వేడుక జరుపుకున్న వీరమాచనేని పృధ్వీ రాజ్ - మౌనికలకూ (జాస్తి వారి కుమార్తె, అల్లుడు) ఫంక్షన్ హాల్ నిర్వాహకులు మాలెంపాటి రంగారావు గారికి అభినందనలు.
దేశంలో అన్ని చోట్లా ఇలాంటి హరిత వేడుకలు జరిగితే ఎంత బాగుంటుందో కదా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
27.12.2025