ప్రాతూరి శాస్త్రి 23.08.2020. ....           23-Aug-2020

                               *చేయి చేయి కలుపుదాం...  స్వచ్చ హరిత చల్లపల్లిని సాధిద్దాం*.  

ప్రకృతి పులకించింది. 

కార్యకర్తలు ఆనందంతో పరవసించారు

వర్ష బిందువులు కార్యకర్తల శరీరాలను తాకి వెళ్ళిపోయినాయి

అవిశ్రాంత కృషి.  ఒక్కసారి అందరి మనసులు, హృదయాలు నిశ్శబ్దం. గతంలోకి వెళ్లిపోయారు

చల్లపల్లి  ఒక మధురభావన.  బహిరంగ మలవిసర్జన ను అరికట్టడం, దానికి పడిన శ్రమ, అతిముఖ్యమైనది

 

డంపింగ్ యార్డు తలచుకుంటే కార్యకర్తల శరీరాలు గగుర్పొడుస్తాయి

300 రోజుల పండుగకు వచ్చిన సుద్దాల అశోక్ తేజ గారి పాదయాత్ర, వారు ఢిల్లీలో చల్లపల్లి గురించి చెప్పడం,  వెంకయ్యనాయుడుగారు డా.డీఆర్కే ప్రసాద్ గార్కి ఫోన్ చేయడం, ఎంత ఆనందం

డంపింగ్ యార్డ్ సాధించుకొనడం, ఉద్యానవనం ఏర్పాటు, వెంకయ్యనాయుడు గారి రాక సైనికులందరికి సలాం చెప్పటం,

ఏం మరచిపోతాం ఒళ్ళు గగుర్పొడుస్తుంది 

ఒక్కోరోజు అబ్బా ఇవన్నీ మనమే చేశాం అదో గర్వం

అన్నిటికన్నా 600 రోజులకు బైపాస్ రోడ్డు ఉద్యాననవనంగా మారడం,

చల్లపల్లి కే కలికితురాయి బుద్ధప్రసాదుగారి ఆనందం.

శివరాంపురం - కళ్లేపల్లి రోడ్డు ఏమని ప్రారంభించామో మూడు నెలల సమయం పట్టిందిచెరువు చుట్టూ ఉద్యానవనం, బుద్ధప్రసాద్ గారి పాదయాత్ర, కార్యకర్తల కోలాటం,

732 రోజులకు పంచాయతీ రాజ్ మంత్రిగారు అయ్యన్నపాత్రుడుగారు రావడం వూరంతా దర్శించి ప్రశంసించడం,ఏ కార్యకర్తకు ఆనందబాష్పాలు రావండి ,

ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహారా రెడ్డి గారు వచ్చి ప్రశంసించడం

మన సర్పంచ్ గారు స్వచ్ఛ భారత్ ఐకాన్ కోసం గుజరాత్ వెళ్లడం

కార్యకర్తలు నిస్వార్ధంగా పట్టుదలతో బాధ్యతగా ఉద్యమాన్ని ముందుకు అడుగులేయిస్తున్నారు

మా మార్షల్స్ డా.డీఆర్కేప్రసాద్, డా.పద్మావతి గార్లు వారందరిని ఓ క్రమశిక్షణగా బెటాలియన్ ను నడిపిస్తున్నారు

నేను బాగుండాలి అనుకోవడం స్వార్ధం

నేనుకూడా బాగుండాలి అనుకోవడం సహజం

నావల్ల పదిమంది బాగుపడాలి అనుకోవడం అద్భుతం 

ఇదే సూత్రం డా.డీఆర్కేప్రసాద్,డా.పద్మావతి గార్లది, వారి కార్యకర్తలది.

పదిమంది బాగుపడితేనే కదండీ వూరు బాగుండేది

 మన వూరు మన పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా వుంటాయో అప్పటి జీవనం ఊహించుకోండి. ఎంత మధురం. 

ఒక్కసారి వచ్చి చూస్తేగానీ తెలీదు.

మహిళలు 2 గం వంచిన నడుమెత్తకుండా పనిచేస్తారు 

డా.పద్మావతి గారే ఆదర్శం. ఆమె చేసే విధానమే వేరుగావుంటుంది

 ఒక్క మంచినీరు తాగే క్షణాలు తప్ప మిగిలిన సమయమంతా  పనిచేస్తూనేవుంటారు 

పనిచేసే క్షణాలు మధురం

ప్రాతూరి శాస్త్రి

22.08.2020