ప్రాతూరి శాస్త్రి 24.08.2020. ....           24-Aug-2020

                           పచ్చదనం – పరిశుభ్రత నిండిన పల్లె .. మన చల్లపల్లి 

    చెత్త సంపద కేంద్రము

2017 లో జూన్ నెలలో ప్రతి గ్రామంలో చెత్త సంపద కేంద్రము ఏర్పాటు చేసి వర్మి కంపోస్టు తయారు చేసి రైతులకు అమ్మవలసినదిగా ప్రభుత్వం ఆదేశించింది.

  డా.పద్మావతిగారు మన డంపింగ్ యార్డులో ఏర్పాటు చేయదలచారు.

 ఆరోజుల్లో చెత్త డంపింగ్ చేస్తున్న ప్రాంతంలో విజయవాడ రోడ్డుకు లెవెల్ గా ఉండేటట్లు నిర్మాణం చేయదలచారు.

 ఆచటనున్న చెత్తగుట్టలు దూరం తరలించాలి. స్మశానం బాగుచేయించాలి.

స్మశానం బాగుచేయడానికి కూలీలు రాలేదు.భయపడ్డారు.

మహిళాసైన్యం ముందుకొచ్చింది శుభ్రం చేయడానికి.

చెత్త గుట్టల తరలింపుకు కార్యకర్తలు రెండుపూటలా వచ్చి చేయడానికి సిద్ధమైనారు. 

964 వ రోజు ఉదయం ఆనంద ఆదివారం, సన్ ఫ్లవర్  హైస్కూలు విద్యార్థుల నృత్యం చాలబాగుంది.

 ఆరోజు సాయంత్రం నుండి డంపింగ్ యార్డులో కార్యక్రమం ప్రారంభమైంది. చెత్త బుట్టలకెత్తి ట్రాక్టరులో లోడుచేయగా యార్డు చివర గోతిలో పోయసాగారు.

  విశేషం ఏమిటంటే నడక సంఘ కార్యకర్తలు ప్రతి రోజు కొందరు, ప్రతి ఆదివారం అందరూ వచ్చి సేవచేశారు.

సత్యసాయి ధ్యానమండలి వారు, లయన్స్ క్లబ్ వారు, దాదాపు అన్ని సంఘాలవారు ఆ నెలలో పని చేశారు.

 దూరం నుండి చూస్తే ఒక ఓపెన్ కాస్ట్ మైన్ లో బొగ్గు తవ్వే కూలీల వలె తాము చేసే వృత్తి మరచి సేవచేశారు.

  ఒకేచోట 150 మంది పని చేస్తుంటే ఒక్కసారి ఊహించండి దృశ్యం ఎంత మధురంగా వుంటుందో

నాకైతే ఫోటోతీస్తుంటే కళ్ళవెంబడి నీరువచ్చేది.

ఉదయం 4.30 ను డి 6.30 వరకు, సాయంత్రం 4  నుండి 6 వరకు తదేక దీక్ష తో చేస్తుంటే సుందర చల్లపల్లె తధ్యం అనిపించింది..

 కాలం నిర్ణయిస్తుంది నీకు జీవితంలో ఎవరు తారసపడతారు అన్నది. 

 నీ నడవడిక నేర్పుతుంది ఎవరితో కలిసి మెలగాలో.

రకరకాల వృత్తుల వారు కలిసి డా.పద్మావతిగారు, డా.డీఆర్కే ప్రసాదుగారు తలపెట్టిన స్వచ్ఛ చల్లపల్లె అనే ఛత్రం కింద పనిచేస్తామని ఊహించారా.

ఓ రోజు శర్మగారు డాక్టరు గారికి ఓ సలహా నిచ్చారు . చెత్తను రోడ్డు గా పోస్తే రోడ్డు ఎత్తుపెరుగుతుంది. దూరం తగ్గుతుందని.

కొంతమంది రోడ్డుకు పోయాగా జేసీబీ ని తిప్పి అణగ గొట్టారు.

                        నిత్య నూతన హరిత చల్లపల్లి 

డా.డీఆర్కేప్రసాద్, డా.పద్మావతి గార్లు వారి కార్యకర్తలు అహర్నిశము శ్రమించి డంపింగ్ యార్డును నందనవనంగా మారుస్తున్నారు

కడియం నుండి మొక్కల లారీ వచ్చింది.

పూర్తిగా చదును చేసిన ప్రాంతంలో మొక్కలు నాటారు.

ఈ యజ్ఞంలో పాల్గొన్న కార్యకర్తలు ధన్యజీవులు.

సాధించే తపనే ఉండాలి గానీ సాధ్యంకానిది లేనేలేదు.

 రండి విచ్చేయండి స్వచ్ఛ సుందర చల్లపల్లి దర్శించండి

ఎక్కడికో వెళ్తే పుణ్యం వస్తుందనుకుంటారు

ఇలాంటి ప్రాంతం చూడండి. ఏ కార్యకర్తను చూసినా పుణ్యం లభిస్తుంది

నిస్వార్ధసేవ, అకుంఠిత దీక్ష, అవిశ్రాంతసేవ గల కార్యకర్తలు.

ఏనాడో చల్లపల్లె పుణ్యం చేసుకుంది.

కార్యదీక్షాపరులు చల్లపల్లి కి చేరారు.

స్మశానం , సంపద కేంద్రము వేరు వేరుగా ఉండునట్లు bamboo  చెట్లు తెప్పించారు. స్మశానం హద్దుగా నాటారు.  

ఆరోజు కార్యకర్తల హడావుడి. నాటినచెట్ల మధ్యనుండి తొంగిచూస్తూ ఫోటోలు దిగారు. ఎంతో కోలాహలం గా మొక్కలు నాటారు.

రెండు రోజుల తరువాత చెత్త సంపద కేంద్ర స్థలము ఎదుట ఉద్యాన వనం ఏర్పాటు చేశారు.

ప్రక్కన చిల్లల వాగు గట్టుకు వాలుగా స్వచ్ఛ సుందర చల్లపల్లి అని ముందు రాళ్లతో అక్షరాలను క్రమంచేశారు.

అక్షరాలను మొక్కలతో తీర్చిదిద్దారు. ఈ ప్రదేశం photo spot గా మారింది.               

ప్రాతూరి శాస్త్రి

24.08.2020.