ప్రాతూరి శాస్త్రి 26.08.2020. ....           26-Aug-2020

                              శ్రమ జీవన మాధుర్యం 

1000 రోజుల పండుగ

 ఎవరైనా చూసారా కదిలే నక్షత్రాన్ని,  అని ఓ కవి వ్రాసారు.

ఎవరైనా చూసారా ఇటువంటి ఉద్యమం అని చల్లపల్లి వాసులంటారు.

 చల్లపల్లి లో ఒక సంవత్సరం సేవచేస్తామని. చల్లపల్లి ని దత్తత తీసికొన్న శ్రీ బుద్ధప్రసాద్ గారితో చెప్పారు డా. డీఆర్కే గారు.

 అనూహ్య రీతిలో సుద్దాల అశోక్ తేజ గారు చల్లపల్లి సందర్శన , వారు రాష్ట్రపతి భవన్ లో చల్లపల్లి దృశ్యాలు చూపడం, వెంకయ్యనాయుడు గారు తమ ప్రసంగంలో చల్లపల్లి లో డాక్టరు గార్ల గురించి తెలపడం, డా.డీఆర్కే గారికి ఫోన్ చేయడం 

మనకు తెలీకుండానే ప్రభుత్వం దృష్టికి వెళ్లడం. వెంకయ్య నాయుడు గారు 1 వ వార్షికోత్సవానికి రావడం , కార్యకర్తలకు లాల్ సలాం చేయడం.

విచ్చేసిన మంత్రులు, ఆహుతులైన సజ్జనులు చేసిన సేవను మెచ్చుకోవడం

 ఇటు డాక్టర్ గార్లను, అటు కార్యకర్తలను ఉత్తేజపరచడం తో ఉద్యమం ముందడుగు వేసింది.

 చల్లపల్లి ని ఆదర్శంగా తీసికొని ఘంటసాల అవనిగడ్డ, నాగాయలంక లలో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

దాదాపు 30 గ్రామాలకు  చల్లపల్లి ఆదర్శమై వారు స్వచ్చ భారత్ కార్యక్రమాలు ప్రాంభించారు.

 మన 1000 రోజుల పండుగ దినాన దాదాపు 25 గ్రామాలనుండి కార్యకర్తలు పాల్గొన్నారు.

డంపింగ్ యార్డులో చిల్లలవాగు గట్టు పై అక్షరాల వద్ద బయట గ్రామాల స్వచ్చ కార్యకర్తలు ఫోటోలు దిగారు.

 శ్రీ డా.గురవారెడ్డి గారు, బుద్ధప్రసాదు గారు, గ్రామాధికారులు, ప్రసంగించారు.

శ్రీ బుద్ధప్రసాద్ గారి ఆనందం వర్ణించనలవికానిది.

డా.డీఆర్కే గారు ప్రారంభ దినం నుండి 1000 రోజుల వరకు ఉద్యమ ప్రస్థానం వివరించారు.

నాగాయలంక రోడ్డులో కమలాల నుండి, బస్టాండు, జూనియర్ కాలేజీ, బైపాస్ రోడ్డునుండి విజయవాడ రోడ్డు న గల డంపింగ్ యార్డు , ఆచటనుండి సభాస్థలికి బైక్ రాలీలో వచ్చినారు.

మనిషికి గుర్తింపునిచ్చేవి వారు చేసే సేవలో అంకితభావం, పట్టుదల, సాధించాలనే తపన, మనకు మన మీద నమ్మకం ఉండడం.

 

               త్యాగ ధనులు మన కార్యకర్తలు

నింగి నేల వెతికినా ఇంత నిస్వార్థ కార్యకర్తలు లభించరేమో.

స్వార్ధం ఉండాలి ఓ మంచి పని సాధించడానికి.

స్వార్ధం వుండాలి ఎదుటి వాని ఆనందాన్ని తన ఆనందంగా మలచుకొనేంత.

స్వార్ధం ఉండాలి గ్రామభ్యుదయం కోసం దేనినైనా సాధించేంత.

రామాయణ కాలంలో హనుమంతుడి లాగా మన కార్యకర్తలకు తమ శక్తి తమకు తెలీదు.

మనమీపని చేద్దాం అంటే చాలు భుజాలకెత్తుకుని సాధిస్తారు.

అలుపెరుగని శ్రామికులు.

ఓ కార్యక్రమం ఇలా చేద్దాం అంటే మరింత సొబగులు దిద్దుతూ సుందరంగా మరింత అందంగా మలచగలిగిన కౌశల్యులు.

ఒక గృహిణి తన ఇంటిని ఎంత అందంగా, ఒద్దికగా మలచుకోగలదో అంతకన్న  సహనం, ధైర్యం,సుందరంగా మాకుమేమే సాటి అంటూ సేవచేయగల నిపుణులు.

వీరందరికన్న ఒక విశిష్ట బృందం ఉంది.

అదే సుందరీకరణ బృందం.

గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన సిద్ధహస్తులు.

తమతమ అభిప్రాయాలు తెలుపుతూ అవకాశం దొరకకపోయినా నొచ్చుకోకుండా రధసారధుల అడుగుజాడలలో నడుస్తున్న కార్యకర్తలకు నమస్సుమాంజలులు.

చల్లపల్లి, స్వచ్ఛ చల్లపల్లి, ఆదర్శ చల్లపల్లి, స్వచ్ఛ సుందర చల్లపల్లి ఎంత భాగ్యశాలివమ్మా నీకు వందనం.

ప్రాతూరి శాస్త్రి

26.08.2020