ప్రాతూరి శాస్త్రి 27.08.2020. ....           27-Aug-2020

                                   కోటి రాగాల వీణ మన చల్లపల్లి

మూడవ వార్షికోత్సవం

1097 స్వచ్ఛ సుందర చల్లపల్లి 12.11.2017

డా.డీఆర్కేప్రసాద్, డా.పద్మావతిగార్ల నేతృత్వంలో స్వచ్ఛ చల్లపల్లి  మూడు సంవత్సరాలు నిండి 4 వ సంవత్సరం లో అడుగిడింది.

ఉషస్సులో 6 గం.కు నాగాయలంక రోడ్డులోని టాయిలెట్లు మన ఉపసభాపతి బుద్ధప్రసాద్ గారిచే ప్రారంభించబడ్డాయి.

తదనంతరం బైక్ రాలీ గా బస్టాండు, ఏ.టి.ఎం.సెంటరు మీదుగా పద్మావతి హాస్పిటల్, అచ్చట నుండి బైపాస్ రోడ్డు లో నారాయణ రావు నగరులో ప్రవేశించి 6 నం. కాలువ దాటి విజయవాడ రోడ్డులో డంపింగ్ యార్డులో నూతనంగా ఏర్పాటుచేసిన చెత్త నుండి సంపద కేంద్రం చేరారు 

చెత్త నుండి సంపద కేంద్రాన్ని ప్రారంభించారు.

అక్కడ నుండి విజయ అకాడమీ కి చేరి సమావేశమైనారు.

నిమ్స్ మాజీ డైరక్టర్ డా.నరేంద్రనాథ్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసి తానెన్నడూ ఇటువంటి సంఘటిత సేవాకార్యక్రమాలు చూడలేదనీ, విజయవంతంగా మూడు సం. లు పూర్తి చేసికొన్నందుకు కార్యకర్తలను అభినందించారు.

బుద్ధప్రసాద్ గారు కార్యకర్తలను ఆశీర్వదించారు.

నారాయణరావు నగరులో ని స్వాగతాలు చూసి, వారి సేవాకార్యక్రమాలు విని ఆనందించారు.

కార్యకర్తలకు వారుచేసిన సేవాచిత్రాలను పుస్తకరూపంలోకి తెచ్చి అందరకీ అందించారు.

సాధించిన దానికి సంతృప్తి ని చెంది అదే విజయమనుకోక ముందుకడుగేయఓయి

                 Appreciation award

   అక్టోబర్ 2, 2017 న విజయవాడలో Indira Gandhi Municipal Stadium  లో జరిగిన స్వచ్ఛతే సేవ కార్యక్రమం ముగింపు సమయాన చల్లపల్లి నుండి డాక్టరు దంపతులకు ఆహ్వానం వచ్చింది.

 విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వచ్ఛతే సేవముగింపు కార్యక్రమంలో డా. డి.ఆర్.కె. ప్రసాద్, డా. పద్మావతి గార్లకు APPRECIATION AWARDను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందజేశారు. త్వరలో చల్లపల్లికి రానున్నానని తెలియ చేశారు.

స్వచ్ఛ చల్లపల్లికి జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీ, ఉత్తమ పార్కు, ఉత్తమ బస్టాండ్ అవార్డులను కలెక్టర్ లక్ష్మీకాంతం గారు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు, గ్రామ పంచాయతీ వారు హాజరైనారు. విజయవాడలో కార్యకర్తలకు భోజనాలను కేశవరావు గారు (GREEN LANDS) ఏర్పాటు చేశారు.

 

ప్రాతూరి శాస్త్రి

27.08.2020