ప్రాతూరి శాస్త్రి 28.08.2020. ....           28-Aug-2020

                       శ్రమ జీవన సౌందర్యానికి చల్లపల్లి దర్శనీయం.

జై ఆకుపచ్చ చల్లపల్లి..

జైజై ఐకమత్య చల్లపల్లి

1200 వ రోజు- 23.02.2018

పండుగ....పండుగ వాతావరణం...

ఒకటి కాదు, రెండు కాదు,1200 రోజుల అవిశ్రాంత సేవ 

సేవచేసేందుకు వయసుతో నిమిత్తంలేదు.

విద్యార్థులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు వీరువారననేమి సేవాకార్యక్రమాలలో పాల్గొంటున్నారు

ప్రభుత్వ అధికారులు సైతం సేవ చేస్తున్నారు.

ఈరోజు 110 మంది విజయవాడ రోడ్డులో బాలాజీ అపార్ట్మెంట్స్ నుండి డంపింగ్ యార్డు వరకు ఊడ్చేవారు ఊడుస్తూనే వున్నారు

కత్తులు పట్టేవారు పిచ్చిమొక్కలపని పట్టారు

ఇంతమంది అలా అలా చేస్తూ డంపింగ్ యార్డుకు చేరారు. 

డా.డీఆర్కేప్రసాద్, డా.పద్మావతి గార్ల గురువుగారు డా.నల్లూరు రంగారావు గారు, డా.పద్మావతి గారి నాన్నగారు తరిగోపుల కోటేశ్వరరావు గారు ఒంగోలు నుండి చూడడానికి వచ్చి చల్లపల్లి ని దర్శించారు.

డా.గోపాళం శివన్నారాయణ గారు, డా.కోమలి గారు, డా.రంగారావు గారు 1200 రోజు జ్ఞాపకంగా రెండు మామిడిమొక్కలు నాటారు. 

కార్యకర్తల అందాల సుందరి పండుగ ఎంతో వైభవంగా జరిగినది.

ప్రాతూరి శాస్త్రి

28. 08.2020.