ప్రాతూరి శాస్త్రి 30.08.2020. ....           30-Aug-2020

     సహజీవనము సమభావనము, సమతా భావము గల వారు స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు.

1300  వ రోజు సుందర చల్లపల్లి 03.06.2018

న భూతో న భవిష్యతి. ఎవరన్నారో తెలీదు కానీ నిజమేమరి.

నవంబరు 12, 2014 న స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం మొదలైనప్పుడు 15 గురు కార్యకర్తలు.

ఎవరూహించారు ఈకార్యక్రమం అంతులేని, వెలగట్టలేని అమూల్యమైన సేవ అవుతుందని.

100 రోజులు నాడు కోనేరు హంపి గారు చల్లపల్లి దర్శించారు . ఎంతో ప్రశంసించారు.

ప్రముఖులు దర్శించి సలహాలివ్వడం తదననుగుణంగా స్పందించడం  

రథసారధులు డా.డీ ఆర్ కే ప్రసాద్ గారు, డా.పద్మావతి గార్ల సంకల్పం దృఢమైనది.

కార్యకర్తలు అటువంటి వారేఅయ్యారు. 

డా. పద్మావతి గారి నేతృత్వంలో గ్రామ సుందరీకరణ ప్రారంభమైంది.

రహదారివనాలు, అధునాతన టాయిలెట్లు , గ్రామంలో రోడ్ల పై పేవరు టైల్స్ వేయించడం , అత్యంత వైభంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చకచకా ఏర్పడ్డాయి. 

ఇలా ఒక్కసారి చూస్తుండగానే 1300 రోజులైనాయి.

కార్యకర్తలలో అదే పట్టుదల, అదే దీక్షతో వేకువ సేవలు చేస్తూనేవున్నారు

ఈరోజు భవగ్ని నగర్ లో రోడ్డుకిరుప్రక్కల శుభ్రం చేశారు.

ఈనాడు ముఖ్య అతిథి గా డా..రమణమూర్తి గారు ఆంధ్ర హాస్పిటల్, డా.గోపాళం శివన్నారాయణ గారు, యం. వి.సుబ్బారావు గారు విచ్చేసారు.

100 మంది కార్యకర్తలు, అతిధులు ఆలోచించండి పండుగవతావరణమే కదా! 

జీవితంలో మరపురాని సంఘటనలు.

1300 రోజులు ఇట్టే గడిచపోయాయి.

ఎన్నో ఎన్నెన్నో మధుర స్మృతులు .

జీవిత యానంలో ఒకరి మెప్పుకోసం కాక

మన ఊరు మనం, మన కోసం మనం

నేను నివసించే ఊరు బాగుండాలి.

పరిశుభ్రంగా ఉండాలి అని ఆశిస్తే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రావడానికి ఎంతో సమయం పట్టదు.

ప్రాతూరి శాస్త్రి

30.08.2020.