ప్రాతూరి శాస్త్రి 31.08.2020. ....           31-Aug-2020

 తరిగోపుల ప్రాంగణాన్ని నందనోద్యానవనంగా తీర్చిదిద్దిన సుందరీకరణ సృష్టికర్త డా.పద్మావతిగారు.

1400 వ రోజు. సుందర చల్లపల్లి 11.09.2018

1400 రోజుల సేవాయత్ర

ఎవరి ప్రశంసలకు అందనంత ఎత్తుకెదిగారట.

కానీ ఏ కార్యకర్త ఉబ్బిపోడు

తను సాధించవలసినది చాలా ఉంది

అదే స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధన.

 

ప్రకృతి లోని అందాలు ఎంతని వర్ణించినా

దాని వన్నె ఇంకాపెరుగుతుంది.

ప్రకృతిని పోలిన కార్యకర్తలు

24 కారెట్ల బంగారం

సుందరీకరణ బృందానికి ఇవేవీ పట్టవు

వారి పనితీరేవేరు

ఎంచక్కా నేలపై కూర్చొని పనిచేస్తూనేవుంటారు.

డా.పద్మావతిగారి బృందం పనిలో దిగితే

చేసినచోట అద్దంలా మెరిసిపోతోంది

ఈనాటి కార్యక్రమంలో మన ఆర్.డీ.ఓ.గారు, యం. ఆర్.ఓ.గారు, మండల  ప్రెసిడెంట్ శ్రీ లంకబాబుగారు, మిక్కిలినేని పాపారావుగారు సుందర చల్లపల్లి విజయాలను ప్రశంసిస్తూ భవిష్య ప్రణాళిక కై సూచనలు చేశారు.

డంపింగ్ యార్డు ను మరింత అందంగా తీర్చిదిద్దాలని అందరూ తలంచారు.

 

ప్రాతూరి శాస్త్రి

31.08.2020