ప్రాతూరి శాస్త్రి 01.09.2020. ....           01-Sep-2020

                         శ్రమ చేయడం కష్టం కానీ శ్రమ ఫలితం మాత్రం మధురం

 1462 వ రోజు

12 11.2018 నాల్గవ వార్షికోత్సవ వేడుకలు.

సమయం :  సాయంత్రం 3.30ని

 వేదిక     :      చల్లపల్లి సెంటరు 

నాల్గవ వార్షికోత్సవ సంబరాలు  

దీపావళి నాటి ఆకాశవెలుగులవలె

భువిలో విద్యార్థుల ప్రదర్శనలు

అందరినీ ఆకట్టుకున్నాయి.

సభలో మన ఉపసభాపతి శ్రీ మండలి బుద్దప్రసాదుగారుస్మార్ట్ పల్స్ సి ఈ ఓ  గంగయ్య గారుమన మంత్రి లోకేష్ గారి ఓ యస్ డి  రాజుగారుడి పి ఓ, ఆర్ డి ఓ గారు గ్రామాధికారులు పాల్గొన్నారు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల శ్రమ గూర్చి డా. డీ ఆర్ కే ప్రసాదుగారు వివరించారు

అధికారుల స్పందన చాలా చక్కగా వుంది

కార్యకర్తల ను గొప్పగా ప్రశంసించారు.

ప్రశంసలకు వుబ్బక  మరింత పట్టుదలదీక్షతో విజయసోపానాన్ని అధిరోహించాలన్నారు

స్వచ్ఛ పర్యాటకానికి చిరునామా చల్లపల్లి అని పత్రికలు వర్ణించాయి.

శ్రమసంస్కృతి కి శ్రీకారం చుట్టిన స్వచ్ఛ చల్లపల్లి సేవా ఉద్యమం ఎందరికో ప్రేరణ, స్ఫూర్తి కలిగించింది.అని శ్రీ గంగయ్యగారు పలికారు.

కానీ డా.పద్మావతిగారు, డా.డీఆర్కే ప్రసాదుగారు మాత్రం ఇది కేవలం సామాజిక బాధ్యత అని అంటారు.

కార్యకర్తలు గూడా అదే భావనతో సేవచేస్తారు.

ఈనాటి కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జరిగింది.  చల్లపల్లి లోని అన్ని పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థుల చే పురవీధులలో ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. చల్లపల్లి సెంటర్లో వేదికగా విద్యార్తులందరూ బస్టాండ్ రోడ్డు, విజయవాడ రోడ్డు, బందరు రోడ్డులపై ఆశీనులై సభను జయప్రదం చేశారు.

కార్యకర్తలందరూ కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో పాల్గొన్నారు.

పద్మావతి ఆసుపత్రి సిబ్బంది కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

శ్రమయేవ జయతే 

శ్రమసాంస్కృతి ని  దేశానికీ నూతన వరవడి లో తెలుపుతున్నారని మన యం యల్ ఏ  బుద్దప్రసాదుగారు అన్నారు .

జయహో కార్యకర్తా                         

ప్రాతూరి శాస్త్రి

01.09.2020