ప్రాతూరి శాస్త్రి 02.09.2020. ....           02-Sep-2020

 పర్యావరణాన్ని కాపాడుదాం.

హరితవేడుకలు ప్రోత్సహిద్దాం

1500 వ రోజు సంబరాలు -స్వచ్ఛ సుందర చల్లపల్లి (20.12.2018)

డిశంబర్ 20 గురువారం నాటికి మన స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం ప్రారంభించి 1500  రోజులు. 2013 డిశంబర్ 20 న గంగులవారిపాలెం రోడ్డును బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా చేయటానికి  ఉద్యమాన్ని మొదలు పెట్టాము.  డిశంబర్ 20 వ తేదీకి 5 సంవత్సరాలు నిండాయి.

ఆయుష్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ మత్తు డాక్టరు, యార్లగడ్డ వాసి అయిన  డా. యార్లగడ్డ రమేష్ గారువిజయవాడలో ప్రముఖ ఫిజిక్స్ లెక్చరర్, రామానగరం వాస్తవ్యులు అయిన  వారి శ్రీమతి కంఠమనేని శారద గారు , ఆళ్వారు స్వామి గారు అతిథులుగా విచ్చేసారు

రోటరీ గవర్నరు గారు కూడా ఆ రోజు మన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మన శాసనసభ ఉప సభాపతి గారైన శ్రీ మండలి బుద్ధ ప్రసాదు గారు అధ్యక్షత వహించారు.

ఆ రోజు ఉదయం 5 గంటలకి గంగులవారిపాలెం రోడ్డు  మొదట్లో కలుసుకున్నాము..అక్కడి నుండి ప్రదర్శనగా బయలుదేరి పద్మావతి ఆసుపత్రి ప్రక్కన నూతనంగా నిర్మింపబడిన పద్మాభిరామం”  ప్రాంగణానికి చేరి  అచట మన సమావేశాన్ని నిర్వహించారు.

తమ  శ్రమతో, స్వేదంతో, ధనంతో  గ్రామాభ్యుదయములో అద్భుతమైన ఫలితాలను సాధించిన కార్యకర్తలందరూ తమ విజయాలను నెమరు వేసుకొనటానికి  ఆరోజు ఉదయం 10 గంటల వరకు గడపటానికి సిద్ధపడ్డారు.

ఈ 5 సంవత్సరాలలో సాధించిన విజయాలు.

1. గంగులవారిపాలెం రోడ్డు తో మొదలు పెట్టి చల్లపల్లి లో ఉన్న ప్రతి రోడ్డును బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా తయారుచేయడం.

2. మరొక్క మొక్క కూడా పెట్టటానికి వీలు లేనంత ఒత్తుగా చల్లపల్లి మొత్తంలో మొక్కలు నాటాము. రహదారి వనాలను ఏర్పరచాము.

3. చిల్లల వాగు ఒడ్డున ఆహ్లాదకరమైన శ్మశానాన్ని ఏర్పరుచుకోగలిగాము. మరింత ఉపయోగకరంగా, సుందరంగా చేయడానికి సిద్ధపడుతున్నాము. 

4. అందమైన డంపింగ్ యార్డ్ ని తయారుచేసుకోగలిగాము. చెత్త నుండి సంపద తయారు చేసే  కేంద్రాన్ని నిర్మించుకున్నాము.

5. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహనను పెంచగలిగాము.

6. మూడు చోట్ల (NTR పార్క్ లోనూ, నాగాయలంక రోడ్డు లోనూ, RTC బస్ స్టాండ్ లోనూ) ఆధునిక పబ్లిక్ టాయిలెట్లు ఏర్పడ్డాయి.

ఇట్లు

డా. దాసరి రామ కృష్ణ ప్రసాదు

16.12.2018.

ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్విరామంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ ఆదర్శంగా భారతదేశం గర్వించే విధంగా స్వచ్చ చల్లపల్లి కార్యక్రమాన్ని అలుపెరుగక అంకిత భావంతో నడిపిస్తున్న స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలకు హృదయ పూర్వక అభినందనలు.

 

ప్రాతూరి శాస్త్రి

02.09.2020