ప్రాతూరి శాస్త్రి - 14.09.2020.....           14-Sep-2020

పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత 

సుందరీకరణకు మరికొన్ని సహాయ సహకారాలు.

స్థిరసంకల్పంతో చేసే మహాఉద్యమానికి మనకు తెలీకుండానే సాయం చేయవస్తారు.

ఉదయసింగ్ గౌతమ్ స్వచ్చ చల్లపల్లి కి mentor గా వ్యవహరిస్తూ చల్లపల్లి అందాలు ద్విగుణీకృతము చేయ సలహాలు ఇచ్చారు డాక్టరు గారికి.

1. ప్రతి షాపు ముందు స్వచ్ఛ సుందర చల్లపల్లి అని వ్రాసిన చెత్త కుండీలు ఏర్పాటు.

2. పెద్ద పెద్ద కుండీలలో పూలమొక్కలు నాటి బజారులో షాపుకొక్కటి వంతున ఉంచి పోషణ బాధ్యత షాపు వారు చూచుట.

 3. Poll mounted dust bins ఏర్పాటు చేయుట వలన దారిలో తింటూ వెళ్లేవారు రోడ్డు మీద వేయకుండా డస్ట్ బిన్ లో వేయించుట.

4. గ్రామంలోని కరంటు, టెలిఫోన్ స్తంభాలపై మన జండా రంగులు పసుపు, ఆకుపచ్చ వేయించుట.

5. గ్రామంలోని వంతెన, కల్వర్టు గోడలకు పసుపు, నలుపు రంగుల చారలు వేయించుట

6. గ్రామంలో చెత్త తీసికొని వెళ్లే బండ్లకు ఓ పాట"చెత్త బండి వచ్చిందోయ్" వేయుట ద్వారా ఇండ్లలోని వారు సులువుగా చెత్తవేయుట వీలవుతుంది.

7. గ్రామంలో ఆచటచట నినాదాలు " రోడ్డుపై చెత్త వేయరాదు వ్రాయించి టీ షాపులు, పండ్ల బండ్లు, మరికొన్ని షాపుల వద్ద ఉంచుటవల్ల చెత్త ను కుండీలలోనే వేసే అవకాశం ఉంది.

ఇలా ఉదయసింగ్ గారు వచ్చినప్పుడు కొత్త సలహాలు ఇచ్చేవారు.

        పై చెప్పినవి జరుగుట వలన గ్రామ సుందరత పెరుగుచున్నది గదా.

- ప్రాతూరి శాస్త్రి

14.09.2020.