ప్రాతూరి శాస్త్రి - 09.10.2020....           09-Oct-2020

 స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల పోలవరం, పట్టిసీమ యాత్ర (12.05.2018)

 

40 మంది స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు నిన్న పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ లను సందర్శించడం జరిగింది.  డా.గోపాళం శివన్నారాయణ గారు కూడా తమ 5 గురు బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చల్లపల్లి నుండి ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు మన బృందంతో పాటు ఉండి కార్యక్రమం అంతా చక్కగా జరిగేట్లు చూశారు. Excise Department కు చెందిన ఏలూరు AES పరుచూరి సురేష్ బాబు గారు పోలవరం S.I వెంకటేశ్వరరావు గారు, కానిస్టేబుల్ గణేష్ గారు కార్యకర్తలకు కావలసిన ఏర్పాట్లు చేశారు. ఇరిగేషన్ డిపార్టుమెంటుకి చెందిన AEE శ్రీనివాస్ గారు డాం అంతటిని చక్కగా చూపించి వివరించారు. 2016 మే 7వ తేదీన మన కార్యకర్తలు పోలవరం సందర్శించడం జరిగింది. ఇరిగేషన్ DE వెంకటేశ్వరరావు గారు నాడు ప్రాజెక్ట్ గురించి వివరించడం జరిగింది. ఈ సారి కూడా వారు కలిసి ప్రాజెక్ట్ నిర్మాణం చాలా వేగంగా జరుగుతుందని, మరో 6 నెలల తరువాత మళ్లీ పోలవరం సందర్శించమని ఆహ్వానించారు. 

 

పోలవరంలో సహకరించిన అధికారులందరికీ స్వచ్ఛ కార్యకర్తలందరి తరుపున ధన్యవాదములు సమర్పించారు.

 

పర్యావరణ పరిరక్షణ కోసం ఈ టూర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరిగింది.

 

- దాసరి రామకృష్ణ ప్రసాదు

 

ఓ ప్రాజక్ట్ నిర్మాణంలో ఉండగా చూడడం చాలా అదృష్టం.

అందులో పోలవరం ప్రాజెక్ట్. పేపరులో విని చదవడం వలన కొంత సమాచారం తెలుస్తుంది.

నిర్మాణంలో ఉన్న పోలవరం చూడడం చాలా ఆనందాన్నిచ్చింది.

ప్రభుత్వం వారు పోలవరం చూచేవారికీ ఓ ఇరిగేషన్ వారిని పంపారు.

అక్కడ ఓ గైడు ఒక్కొక్క ప్రదేశం గుర్చి మంచి వివరణలు ఇచ్చారు.

ప్రాజెక్ట్ ఎంత గొప్పగా నిర్మిస్తున్నారో డయాఫ్రమ్ వాల్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

లోయలోకి వెళ్లతూ చూచిన అందాలు మరువలేం.  

ఒక్కొక్క యంత్రం పనిచేసేతీరు చాలా చక్కగా తెలిసికొన్నాం. అక్కడ కొండల మధ్య మధ్యాహ్నం 1 – 2 గంటల మద్య 3 సార్లు బ్లాస్టింగ్ ను కూడా చూసాము. సందర్శకులందరికీ టిఫిన్, భోజనం ప్రభుత్వం వారే ఏర్పాటు చేసారు.

 

పూర్తి ప్రాజెక్ట్ మోడల్ ను చూపిస్తూ ప్రభుత్వాధికారులు కార్యకర్తలందరికీ వివరించారు.  

-  ప్రాతూరి శాస్త్రి

09.10.2020.