ప్రాతూరి శాస్త్రి 11.10.2020. ....           11-Oct-2020

 గాంధీజీ ఆశయమైన శ్రధ్ధయు,

పారిశుధ్య బాట వదలక జేయుము

ఘనుల జీవితములే మహిత మార్గముజూపు

నేర్చుకో నేస్తమా శ్రమసంస్కృతి.

 

గాంధీ గారి మునిమనవడు

డా.ఆనంద్ గోఖని, ఎండోక్రైనాలజిస్ట్,

ముంబై చల్లపల్లి రాక.

 

వీరితో అమెరికాలో చికాగోలో పనిచేస్తున్న కంటి డాక్టర్ శ్రీ శొంఠి శ్రీరామ్ గారు, సర్వోదయ ప్రసాదు గారు పాల్గొన్నారు.

తడబడి నడవక, సహనంతో పనిచేస్తూ ధైర్యంతో అడుగేస్తూ, ఉండేవారే స్వచ్ఛ కార్యకర్తలు.

ఫలితమాశించకచేసిన నిస్వార్థ సేవే పదిమందిని నీవద్దకె రప్పిస్తుంది.

గాంధీగారి మునిమనుమడు డా.ఆనంద గోఖని గారు స్వచ్ఛ చల్లపల్లిని దర్శించి అన్నమాటలు

వూరి పచ్చదనం చూడగానే చల్లపల్లి వచ్చిందని గుర్తించారట.

గాంధీగారి ఆశయాలు దేశమంతటా ప్రచారం చేస్తున్నాం కానీ

ప్రత్యక్షంగా చల్లపల్లి లో చూస్తున్నాము అని

మీరు స్వచ్ఛ సుందర చల్లపల్లి అంటున్నారు

కానీ ఈరోజు నుండి స్వచ్ఛ సుందర ఆనంద చల్లపల్లి గా మేము చూస్తున్నాము.

ఇదే అలుపెరుగని నిస్వార్థ సేవకు నిదర్శనం.

చేసిన సేవ ఎన్నటికీ వృథా కాదు.

చివరగా power point presentation చూచి ఆనందించారు.

 

ప్రాతూరి శాస్త్రి

11.10.2020.