ప్రాతూరి శాస్త్రి - 12.10.2020.....           12-Oct-2020

 1475 (25.11.2018) వ రోజు సుందర చల్లపల్లి కార్యకర్తల రాజమండ్రి, కడియం యాత్రావిశేషాలు.         

            ఈరోజు సుందర చల్లపల్లి కార్యకర్తలు 40 మంది కడియం, రాజమండ్రి విజ్ఞానయాత్రకై ఉదయం 4.30 నిమిషాలకి చల్లపల్లి నుండీ బయలుదేరారు.

            భీమడోలు వద్ద శ్రీ పరుచూరి సురేష్ గారు కార్యకర్తలకు అల్పాహారం ఇచ్చినారు. తదనంతరం రాజమండ్రి బయలుదేరారు. 11గం. కు ధవళేశ్వరం చేరాము.

            ఆనకట్ట సమీపంలో సర్ ఆర్ధన్ కాటన్ మ్యూజియం దర్శించడం జరిగింది. ఆ రోజుల్లో ఆనకట్ట కట్టిన నమూనాలు, ఆనాటి పనిముట్లు, కొన్ని విగ్రహాలు చూచి ధవళేశ్వరం ఆనకట్టపై విహరించారు.

            తదనంతరం కడియం చేరి ఓ కళ్యాణమండపంలో సురేష్ గారు ఏర్పాటుచేసిన విందు ఆరగించారు. మండపం పరిసరాలలోని కమనీయ దృశ్యాలు మనసుకు ఆహ్లాదపరచాయి.

          సాయంత్రం కడియం లోని పెద్ద నర్సరీ చూశారు. దారిలో మరో నర్సరీ వద్ద ఆగి కార్యకర్తలు మొక్కలు కొన్నారు.

            రాత్రి 12 గంటలకు చల్లపల్లి చేరాము.

- ప్రాతూరి శాస్త్రి

12.10.2020.