ప్రాతూరి శాస్త్రి - 13.10.2020. ....           13-Oct-2020

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2019

వసుంధర పురస్కారం అందుకొనున్న డా.పద్మావతి.

ఈ వసుంధర పురస్కారం వైద్యురాలు పద్మావతి గారికిచ్చుట సముచితం.

స్వచ్ఛ భావి సమాజానికిది నూతన బాట.

1578*వ రోజు హైదరాబాద్ ప్రయాణం

            అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా "ఈనాడు వసుంధర" అవార్డుకు ఆంధ్రప్రదేశ్ నుండి వైద్య విభాగంలో ఎంపికైన స్వచ్చ చల్లపల్లి కార్యకర్త డా. టి. పద్మావతి గారికి అభినందనలు.

            రామోజీ ఫిలింసిటిలో జరిగే వేడుకలో ఆవార్డును అందుకోవడానికి ఉదయం 4:00 గంటలకు 41 మంది కార్యకర్తలు పద్మావతి ఆసుపత్రి వద్దకు చేరుకుని అక్కడ నుండి హైదరాబాద్ బయలుదేరారు.

            ఆహ్లాదకరమైన వాతావరణంలో రామోజీ ఫిల్మ్ సిటీలో వసుంధర పురస్కారాలు కనులపండుగగా జరిగినాయి.

            మహిళలు విభిన్నరంగాలలో చేస్తున్న విశిష్ట సేవలకు ప్రతిఫలంగా పురస్కారం ఇవ్వడం జరిగింది.

            వైద్యురాలిగాను, సామాజిక సేవ చేస్తున్న డా.పద్మావతి గారు వసుంధర పురస్కారానికి ఎన్నిక చేశారు.

           డా.పద్మావతి గారి మాటలలో స్వచ్ఛ చల్లపల్లి:

            ఇంద్ర ధనసు చీరగా జేసి చిరునవ్వుల పువ్వులను బాటగా వేసి, అడుగడుగునా అందమైన ఆలోచనలతో కట్టుకున్న పాలవెల్లి మా స్వచ్ఛ సుందర చల్లపల్లి. అంటారు.

            ఎంత గొప్ప మనసో గదా.

            ఇంకా ఏమంటారంటే

            సుందరీకరణ లో భాగంగా ఎన్నో అందమైన మార్పులు, మనసుకు ఆహ్లాదంగా ఉంచే పూలు, రహదరికిరువైపులా అందమైన మొక్కలు, పేవరు టైల్స్ తో అలంకరించుకున్నాం మా చల్లపల్లి ని.

          సభలో చివరగా డా.పద్మావతి గారి అభిమతం దేశంలోని ప్రతిఒక్కరు వారానికో గంట తమ గ్రామంలో పారిశుధ్య కార్యక్రమం చేపడితే స్వచ్ఛ భారత్ అతి త్వరలోనే చూడగల్గుతామ్.

            నిజమే మరి.

శ్రమ వెంట అర్ధము తనకు తానై వచ్చు

నిస్వార్థ సేవ నింగి కెగయు

అవార్డులకు రివార్డులకు ఉబ్బరాదు

నేర్చుకో నేస్తమా శ్రమసంస్కృతి.

 

- ప్రాతూరి శాస్త్రి

13.10.2020.