ప్రాతూరి శాస్త్రి - 14.10.2020. ....           14-Oct-2020

 "సంఘటనం ఒక యజ్ఞం, సమిధ గమన జీవనం.

భరతమాత పాదాలకు సరి మువ్వలం.

                  ........

1727 వ రోజు - 04.08.2019

స్వచ్ఛ సుందర చల్లపల్లిలో ఆనందహేల.

రోజువారీ కార్యక్రమానికి భిన్నంగా

స్వచ్ఛతా నడక ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

నాగాయలంక రోడ్డులో టాయిలెట్లు నుండి మోపిదేవి గుడి వరకు 6 కి.మీ. నడక.

ఉదయం 4.30 ని. కి కార్యకర్తలు, సత్యసాయి ధ్యానమండలి, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, హీరో మోటార్స్, నడకసంఘ మిత్రులు నాగాయలంక రోడ్డులో చేరారు. 

4.32ని కి పంచాయితీ ఈఓ గారు ప్రారంభించగా మొదలైంది నడక.

కప్తాన్ పాలెం, పెదప్రోలు, కొక్కిలిగడ్డ, భాషితా హైస్కూలు, మోపిదేవి గుడి వద్ద ఆగుతూ గాయకుడు శ్రీనివాస్ పాటలు పాడుతూ నినాదాలు చెపుతూ నడక సాగించారు.

మోపిదేవి ఉదయం 6 గం. కు గుడివద్దకు చేరారు.

మోపిదేవి కార్యకర్తలు స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు కలిసి గుడి పరిసరాలు చీపుళ్ళతో శుభ్రంచేశారు.

మోపిదేవి గుడి వద్ద సేవాయజ్ఞం చేసాక నినాదాలు పలికారు.

పలు కార్యకర్తలు విరాళాలు ఇచ్చారు.

అనంతరం భాషితా హైస్కూల్ లో అల్పాహారం సేవించారు

స్వచ్ఛతా నడక వల్ల సామాజిక సేవా దృక్పధాన్ని ప్రజలలో అవగాహన కల్పించడానికి తోడ్పడుతుంది.

- ప్రాతూరి శాస్త్రి

14.10.2020.