ప్రాతూరి శాస్త్రి - 27.10.2020....           27-Oct-2020

 ఋషికొండ

సాగరతీరాన అలల తాకిళ్ళు, మరోపక్క కొండపై రిసార్ట్స్ గల ఋషికొండ బీచ్ అందాల ప్రకృతి సోయగాలు ప్రతిఒక్కరూ తిలకించవలసిందే.

కిందటిరోజు అలసట తీర్చుకొని ఉదయం 8.30ని. ఋషికొండ బయలుదేరి 9 గం కు చేరాము.

కొంతమంది అలలకోసం సముద్రంలో కి వెళ్లి తడిసి ఆనందం పొందితే గుర్రాలపై స్వారీ చేసి ఫోటోలకు ఫోజులిచ్చారు మరికొందరు బీచ్ లో దూరంగా వెళ్లి కొండరాళ్లను తిలకించారు. కొందరు అందరిదీ ఒకరకమైన ఆనందాలు ఉండవు.

మన సాహస బాలిక డా.పద్మావతి గారి పారాచూట్ లో గగన విహారం ఓ అద్భుతం. ఇలా సాగరతీరాన్ని ఆస్వాదిస్తూ 2 గం గడిపాము. మరో ఆనందం ఆచటి ముంతమసాలా, మామిడి ముక్కల మసాలా.

11.30 కి కైలాసగిరి చేరాము.

ముఖద్వారం వద్ద గ్రూప్ ఫోటో దిగి. ప్రకృతి సోయగాలలో ఫోజులిస్తూ ఫోటోలు, కైలాసాగిరి అందాలు తిలకిస్తూ కొందరు రాలేనిస్థితిలో చతికిలబడగా మిగిలినవారు రైలుబండి ఎక్కి కొండచుట్టుకు వచ్చారు.

1.30ని.కు బయలుదేరి సీతమ్మధార వచ్చి lansum oxygen tower 36 అంతస్థుల భవన సముదాయము, 35, 18 అంతస్తులు తిలకించి భోజన విరామానికి వెళ్లారు.

సాగరతీర సమీపాన ఎరుగని సుందర సుధామధురం అన్నాడో కవి నిజమే.

శ్రమ సంస్కృతికి లభించిన అరుదైన గౌరవం:

AFA వారి పురస్కారం అనగానే సినిమా యాక్టర్లు వస్తారు. అక్కినేని కుటుంబం వస్తారు అరుదైన ఫోటోలు ఉంటాయి ఏదో అలా ఊహాగానాలు చేసాం. తీరా ఊడాపార్కు లోకి రాగానే బ్యానర్లు, వాటిపై చిత్రాలు చిత్రంగా ఉన్నాయి.

బృందావన్ వచ్చి తాతగారూ ఫోటోలు లేవు, మన లోగో మాత్రమే ఉందన్నాడు. 

కాస్త నిరాశ గల్గినా ఫోటోలలో మురళీమోహన్, విద్యాసాగర్ రావు గారు, అఖిలాండేశ్వరి (మహానటి సావిత్రి కుమార్తె), బాపు గారి తమ్ముడు, శోభ నాయుడు గారు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు తెలుసు.

తోటకూర ప్రసాద్ గారు తప్ప సభ్యులు గూడా తెలీదు. హాల్లోకి వెళ్లాం. పెద్దస్టేజీ.

సభ ప్రారంభం అయ్యేవరకు శారద గారు, వినోద్ బాబు గార్లు అక్కినేని పాటలు పాడారు.

పురస్కారగ్రహీతలు ఒక్కొక్కరు రాసాగారు. వస్తున్నారు ముందు వరుసలో ఆశీనులయ్యారు. మన డాక్టరు గార్లను పిలవడంలేదు. కాస్త ఫీలయ్యాము. గురవారెడ్డి గారు రాలేదు.

ఇంతలో తోటకూర ప్రసాదుగారు డాక్టరుగారితో మాట్లాడారు అమ్మయ్య ముందువరుసలో కి వెళ్లారు. సేవారత్న అంటున్నారు గానీ మనలను పిలవకపోతే బాధనిపించింది. అమ్మ పెట్టనందుకు గాడు తోడికోడలు దెప్పినందుకు కోపం వచ్చింది సామెత. ఇంతలో గురవారెడ్డి గారు వచ్చారు. బృందావన్ మన షర్ట్ ఇచ్చాడు. వారు వచ్చాక సీనే మారిపోయింది.

పురస్కార గ్రహీతలను ఒక్కొక్కరిని పిలిచారు. సేవారత్న అని గురవారెడ్డి గారిని డాక్టర్ గారిని పిలిచారు.

మరల మరొబాధ

డాక్టరమ్మ గారిని పిలవలేదు అని. ఇవన్నీ మా బాధలే సుమీ.

ఇంతలో ట్రస్టు సభ్యులు డాక్టరమ్మ గారిని రామారావు గారిని పిలిచారు. చాలా ఆనందం కలిగింది.

- ప్రాతూరి శాస్త్రి

27.10.2020