అహం మీసం త్రిప్పుతుంటే
స్వార్ధములు తొడగొట్టుతుంటే – అహం మీసం త్రిప్పుతుంటే –
బిడియములు, సందిగ్ధతలు మరి కొంతమందిని అడ్డుకొంటే –
అడ్డు గోడలు దాటుకొంటూ బాధ్యతలు గుర్తుంచుకొంటూ
గ్రామ సేవకు దిగే వారలు కదా అభివందనార్హులు?