సురేష్ నాదెళ్ల, కనెక్టికట్, U.S.A. - 28.10.2024....           28-Oct-2024

ఏ దేశమేగినా - ఎందుకాలిడినా

ఏ పీఠమెక్కనా - ఎవ్వరేమనినా

పొగడరా! నీ తల్లి భూమి భారతిని

నిలపరా! నీ జాతి నిండు గౌరవము....

          అనిన 20 వ శతాబ్దపు కవి రాయప్రోలు సుబ్బారావు గారి గేయం కన్నా మాతృదేశం పట్ల అభిమానమూ, పొగడ్త ఏముంటుంది!

          ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలలో కాలుపెట్టిన భారతీయులు గానీ, బ్రిటన్లో పీఠమేక్కిన సునాక్ గానీ, తమ జాతి గౌరవం నిలబెట్ట వలసినవారే!

          కాకిపిల్ల కాకికి ముద్దోస్తే వింత కాదు గాని, హంస పిల్ల కాకికి సైతం ముద్దు రావలసిందే!

          మరి అలాంటి హంస జాతికి చెందిన గొప్ప ఉదాహరణలు చల్లపల్లి కార్యకర్తల దశాబ్ది కాల శ్రమదానోద్యమం కన్నా గొప్పవీ, పొగడదగినవీ, ప్రస్తుత భారతదేశంలో ఏమున్నాయి?

          దేశ విదేశాల్లోని అందరికీ రుచించే మహత్తర సుదీర్ఘ శ్రమదాతలే మన జాతి గౌరవం నిలుపుతున్న సాహసవంతులు!

- సురేష్ నాదెళ్ల

 

   27.10.2024