హరిత వేడుకగా కొక్కిలిగడ్డ హరికుమార్ వివాహం....           17-Oct-2025

 హరిత వేడుకగా కొక్కిలిగడ్డ హరికుమార్ వివాహం 💐💐

               ఈరోజు (17.10.2025) ఘంటసాల గ్రామంలోని క్రిష్టియన్ పేటలో జరిగిన హరికుమార్ వివాహం పూర్తి హరిత  వేడుకగా జరిగింది. హరికుమార్ చల్లపల్లి పద్మావతి ఆసుపత్రిలో గత 12 సంవత్సరాలుగా కాంపౌండర్ గా పని చేస్తున్నారు.

               అతిధులును, ఆత్మీయులను ఆహ్వానించడానికి ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ ని మాత్రమే వాడారు.

               వివాహ వేదికను సహజమైన పూలతో ఎంతో అందంగా తయారుచేసారు.

               భోజనాలలో ఎక్కడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వస్తువులు వాడలేదు. భూమిలో కరిగిపోయే విస్తర్లను, పేపర్ గ్లాసులను మాత్రమే వాడారు.

               తన వివాహ వేడుకను పూర్తిగా పర్యావరణహితంగా జరపాలని నిశ్చయించుకుని చేసి చూపించిన హరికుమార్ కు, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు.

               హరి – మౌనిక లకు వివాహ శుభాకాంక్షలు.

-ప్రసాద్ వేల్పూరి

17.10.2025.