చల్లపల్లి లో మరో హరిత వేడుక 💐💐....           04-Nov-2025

 చల్లపల్లి లో మరో హరిత వేడుక 💐💐

               నిన్న చల్లపల్లినారాయణరావు నగర్ లో శ్రీ గంధం నాగ బృందావన్ కుమార్ - శ్రీమతి లక్ష్మణ ల కుమారులు తర్షిత్, జశ్వంత్ ల పంచకట్ల వేడుకను పూర్తి హరిత వేడుకగా నిర్వహించారు.

               వేదికను అరటి ఆకులతో అందంగా అలంకరించారు.

               భోజనాలలో అరటి ఆకులను, మంచినీళ్లకు స్టీలు గ్లాసులను వాడారు.

ఈ కార్యక్రమంలో ఎక్కడా ఒక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువు కూడా వాడలేదు.

               ఇలా హరిత వేడుకగా నిర్వహించిన ఈ స్వచ్ఛ కార్యకర్తలకు, వీరికి సహకరించిన కుటుంబ సభ్యులకు, మిత్రులకు అభినందనలు  🤝

- ప్రసాద్ వేల్పూరి

    04.11.2025.