హరిత వేడుకగా జరిగిన వినయ్ కుమార్, ప్రసన్న ల వివాహ వేడుక....           29-Dec-2019

            స్వచ్చ చల్లపల్లి కార్యకర్త, స్వచ్చ యార్లగడ్డ రధసారధి అయిన తూము వేంకటేశ్వరరావు, స్వచ్చ చల్లపల్లి కార్యకర్త శ్రీమతి ఇందిరాకుమారి గార్ల పెద్ద కుమార్తె వివాహ సంధర్భంగా ఈ రోజు చల్లపల్లి లో జరిగిన రిసెప్షన్ ను నిజమైన హరిత వేడుకగా చేయడం చాలా సంతోషకరం.

 

            ఒక్కసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులేవీ వాడలేదు. ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ పై ఆహ్వానాన్ని రాశారు. అలాగే ఫోటో కాగితంపైనే ముద్రించిన ఫొటోలు పెట్టారు. భోజనాలలో ప్లాస్టిక్ వస్తువులను వాడలేదు. పేపర్ గ్లాసులు, భూమిలో కరిగిపోయే విస్తరాకులు వాడారు. కిళ్ళీలకు ప్లాస్టిక్ కవర్లు వాడలేదు. చెక్కతో చేసిన పన్ను పుల్లలే వాడారు.

 

            పూర్తిగా పర్యావరణహితంగా జరిగిన వేడుక ఇది.

 

            స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలందరి తరపున తూము వేంకటేశ్వరరావు, తూము ఇందిరాకుమారి గార్లకు తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించినందుకు అభినందనలు.

 

- దాసరి రామకృష్ణ ప్రసాదు

29.12.2019.