చల్లపల్లి లో మరో హరిత వేడుక....           19-Feb-2020

              స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు పల్నాటి భాస్కర్, అన్నపూర్ణ ల కుమారుడు రాంచరణ్ వివాహనంతర వధూవరుల పరిచయ వేడుక (రిసెప్షన్) నేడు చల్లపల్లి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలోనూ, విందులోనూ భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. ఫ్లెక్సీ కి బదులు వధూవరులిద్దరి పేర్లను గుడ్డ బ్యానర్ పైనే రాయించారు. భోజనాలలో ఆరటి ఆకులు, పేపర్ గ్లాస్ లు, చెక్క స్పూన్లు వాడారు.

 

          స్వచ్చ చల్లపల్లి స్ఫూర్తిని కొనసాగించిన పల్నాటి కుటుంబసభ్యులందరికీ స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.

 

దాసరి రామకృష్ణ ప్రసాదు

19.02.2020.