Daily Updates

2078* వ రోజు...

 స్వచ్చ - సుందరోద్యమ చల్లపల్లిలో … 2078* వ నాడు.               కొంత ఆహ్లాదకరమైన ఈ ఆదివారం శుభోదయాన – 4.24 వేకువ సమయాన – 12 మంది కార్యకర్తలతో మొదలై, క్రమంగా 30 మంది దాక సమీకృతులై 6.10 దాక జరిగిన గ్రామ పారిశుధ్య బాధ్యతలతో శుభ్ర – సుందరీకృత ప్రాంతం బైపాస్ మార్గంలోని కమ్యూనిస్ట్ వీధికి ఉభయ దిశలలో గల సుమారు అర కిలోమీటరు. గ్రామస్తుల స్వస్తతా భవితవ్యమే – సమాజహిత సానుకూల దృక్పధమే సదాశయ...

Read More

2077* వ రోజు...

స్వచ్చోద్యమ చల్లపల్లిలో – 2077* వ నాడు.               ఈ శనివారం – 2077* వ నాటి శీతల ఉదయాన – వేకువ 4.29 - 6.10 సమయాల నడుమ - ఉపమార్గం (బైపాస్) లో కమ్యూనిస్ట్ వీధి పరిసరాలలో జరిగిన గ్రామ స్వచ్చంద విధులలో పాల్గొన్న వారు 20 మంది. అశోక్ నగర్ దగ్గర నుండి సూరి డాక్టరు వీధి దాక ఈ కొద్ది మంది శ్రమదానంతో బాగానే శుభ్రపడింది.             ముఖ్యంగా – సామ్యవాద వీధి...

Read More

భారతలక్ష్మీ రైస్ మిల్ రోడ్డు నాడు - నేడు...

 భారతలక్ష్మీ రైస్ మిల్ రోడ్డు నాడు - నేడు పబ్లిక్ టాయిలెట్ గా ఉండే భారత లక్ష్మీ రైస్ మిల్ రోడ్డును ‘వాసిరెడ్డి కోటేశ్వరరావు’ మాష్టారి కృషితో బహిరంగ మలవిసర్జన ఆగిపోయింది. వారే అక్కడ చక్కటి రహదారి వనాన్ని ఏర్పాటుచేశారు. వారి తరువాత స్వచ్చ కార్యకర్తలు, ‘మనకోసం మనం’ ట్రస్టు ఆ వనాన్ని నిర్వహిస్తున్నారు. పంచాయితీ వారు చక్కటి సిమెంట్ రోడ్డు వేశారు. ...

Read More

2076* వ రోజు...

 చల్లపల్లి స్వచ్చోద్యమంలో – 2076* వ నాడు.               ఈ బుధవారం (25.11.2020) నాటి వేకువ 4.25 నుండి 6.10 దాక నెరవేరిన గ్రామ బాధ్యతా నిర్వహణలో సమీకృతులైన స్వచ్చంద కార్యకర్తలు 20 మంది. ఆశ్చర్యకరంగా నేటి వీధి శుభ్రతా విధులలో (బహుశా ఆసుపత్రి ఉద్యోగినులు తప్ప) మహిళా కార్యకర్తల ప్రమేయం లేదు. ఒక ప్రక్క వాతావరణ శాఖ నుండి తీవ్ర తుఫాను హెచ్చరికలున్నా, గత ఆదివారం నాటి నిర్ణయం మేరకు చల్లపల్లి – బందరు జాతీయ రహదారిలో – ఆ నాటి గ్...

Read More

2075* వ రోజు...

 స్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2075* వ రోజు             ఈ ఆదివారం (22.11.2020) వేకువనే 4.19 కి, 4.27  సమయాలకు విడిగా మొదలైన చల్లపల్లి గ్రామ వీధుల పారిశుద్ధ్య విధులు 6.06 వరకు కొనసాగినవి. స్వచ్చ సుందరీకృత ప్రాంతాలు రెండు – కార్యకర్తల నిన్నటి నిర్ణయం మేరకు ముందుగా బందరు జాతీయ రహదారిలోని కమ్యూనిస్ట్ వీధి దగ్గర వాహనాలను నిలుపుకొని, వివిధ పనిముట్లతో సన్నద్ధులై తూర్పు రామమందిరం నుండి రాజ్యలక్ష్మి ఆస్పత్రి దాక టీ దుకాణాల వద్ద,...

Read More

2074* వ రోజు...

 స్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2074* వ రోజు             ఈ (21.11.2020) శనివారం నాటి వేకువ 4.30 – 6.05 సమయాల నడుమ బందరు జాతీయ రహదారిలో కొంతమేర జరిగిన గ్రామ శుభ్ర సుందరీకరణలో పాల్గొన్న కార్యకర్తలు 28 మంది. పారిశుధ్య కృషి నెలకొన్న ప్రాంతం భగత్ సింగ్ గారి దంత వైద్యశాల నుండి తూర్పు రామాలయందాక. ఒక వంక పై నుండి జాలువారుతున్న మంచు తెరతోను, మరొక వంక జాతీయ రహదారి ప్రయాణాల రద్దీతోను, వీటికి తోడు కరోనా భూతానికి చిక్కన...

Read More

2073*వ రోజు ...

స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం-2073*వ రోజు .   కరోన విస్తృతి దృష్టిలో ఉంచుకొని ఆదివారాలు మాత్రమే సామూహిక స్వచ్చంద గ్రామ బాధ్యతలు నిర్వహించాలనే కార్యకర్తల నిర్ణయం మేరకు ఈ ఆదివారం ఉదయం 4.05-6.12 సమయాల నడుమ ఆవిష్కృతమైన వీధి శుభ్రతా చర్యలు సంతృప్తి కరంగా సాగినవి. బందరు జాతీయ రహదారిలో – ముల్పూరి రహదారి వనం నుండి ప్రముఖ దంత వైద్యశాల వరకు, కొనసాగిన పారిశుద్ధ్య – సుందరీకరణ విధులలో ఉత్సాహంగా పని చేసిన కార్యకర్తలు 32 మంది. ...

Read More

2072* వ రోజు.........

 చల్లపల్లి సమాజసేవలో అక్షరాలా ఆరేళ్లు – స్వచ్చ చల్లపల్లి సైన్యం – 2072* వ నాటి ఉత్సాహం   ఈ (12-11-2020) నాటి వేకువ 4.10 – 6.00 నడుమ సమయంలో – బందరు జాతీయ రహదారిలో జరిగిన స్వచ్చంద గ్రామ కర్తవ్య పరిపూర్తిలో పాల్గొన్న మొండి కార్యకర్తలు 32 మంది. ఊరి స్వచ్చ సుందరీకరణ ప్రయత్నం జరిగింది. పింగళి మధుసూధనరావు గారి ఆస్పత్రి నుండి భగత్ సింగ్ గారి దంత వైద్యశాల దాక.             ‘...

Read More

2071* వ రోజు......

 2071* వ నాటి సేవా సౌభాగ్యం ఈ (8-11-2020) నాటి వేకువ 4.30 – 6.05 కాలాల నడుమ బందరు జాతీయ రహదారి మీద – 6 వ నంబరు పంట కాలువ నుండి 1 వ వార్డు ముఖద్వారం వరకు వర్ధిల్లిన గ్రామ శౌచ నిర్వహణలో శ్రమించిన స్వచ్చ సైనికులు 46 మంది. సుమారు 400 గజాల సువిశాల రహదారి, దాని ఉభయ పార్స్వాలు, నడుమ నడుమ టీకొట్లు, పండ్ల దుకాణాలు, కొబ్బరి బొండాల విక్రయ కేంద్రం, జూనియర్ కళాశాల ప్రవేశ ద్వారం,స్టేట్ బ్యాంక్ ...

Read More
<< < ... 175 176 177 178 [179] 180 181 182 183 ... > >>