ప్రాతూరి శాస్త్రి - 21.10.2020. ....           21-Oct-2020

 "మధుర భావాల సుమమాల"    

       ..

చల్లపల్లి  ఒక మధురభావన ఈరోజున

2,00,000గంటల శ్రమ, బహిరంగ మలవిసర్జనను

అరికట్టడం, దానికి పడిన శ్రమ, అతిముఖ్యమైనది.

డంపింగ్ యార్డు తలచుకుంటే కార్యకర్తల శరీరాలు గగుర్పొడుస్తాయి.

            300 రోజుల పండుగకు S.P. బాలసుబ్రహ్మణ్యం గారు రావడం, బైకు ర్యాలీ, సుద్దాల అశోక్ తేజ గారి పాదయాత్ర, వారు ఢిల్లీలో చల్లపల్లి గురించి చెప్పడం, వెంకయ్యనాయుడు గారు డా.డీఆర్కేప్రసాద్ గార్కి ఫోన్ చేయడం, ఎంత ఆనందం, మొదటి వార్షికోత్సవం నాడు పద్మావతి ఆసుపత్రి రోడ్డులో ఉన్న తోటమాలి డొక్కు రంగారావు గారిచే కేక్ కట్ చేయించి సంబరపడిన రోజు, డంపింగ్ యార్డ్ సాధించుకుంటం, ఉద్యానవనం ఏర్పాటు, వెంకయ్యనాయుడు గారి రాక , మీ సైనికులందరికి సలాం చెప్పటం, ఏం మరచిపోతాం ఒళ్ళు గగుర్పొడుస్తుంది ఒక్కోరోజు అబ్బా ఇవన్నీ మనమే చేశాం ఆడో గర్వం అన్నిటికన్నా 600 రోజులకు బైపాస్ రోడ్డు ఉద్యనవనంగా మారడం, చల్లపల్లి కే కలికితురాయి బుద్ధప్రసాడుగారి ఆనందం.

            శివరాంపురం ... కళ్లెపల్లి రోడ్డు ఏమని ప్రారంభించామో మూడు నెలల సమయం పట్టిందిచెరువు చుట్టుకు ఉద్యానవనం, బుద్ధప్రసాద్ గారి పాదయాత్ర, కార్యకర్తల కోలాటం, మంత్రిగారు అయ్యన్న పాత్రుడు గారు రావడం వూరంతా దర్శించి ప్రశంసించడం, ఏ కార్యకర్తకు ఆనందబాష్పాలు రావండి, ఆయన పర్సనల్ సెక్రటరీ జవహార్ రెడ్డి గారు వచ్చి ప్రశంసించడం మన సర్పంచ్ గారు స్వచ్ఛ భారత్ ఐకాన్ కోసం గుజరాత్ వెళ్లడం కార్యకర్తలు నిస్వార్ధంగా పట్టుదలతో బాధ్యతగా ఉద్యమాన్ని ముందుకు అడుగులేయిస్తున్నారు.

            మా మార్షల్స్ డా. డీఆర్కే ప్రసాద్, డా. పద్మావతి గార్లు వారందరిని ఓ క్రమశిక్షణగా బెటాలియన్ ను నడిపిస్తున్నారు.  

స్వచ్ఛ సుందర చల్లపల్లి మహోద్యమం ప్రారంభించి అప్పుడే 2000 రోజులు దాటినాయి.

అనుకోగానే మనసు మాటవినదు గదా ... వెనక్కి వెళ్ళిపోయింది.

తూము వెంకటేశ్వరరావు నుండి కెమెరా తీసికొని ఫోటోలు తీసిన రోజులు,

ఆరోజుల్లో మొక్కలు నాటినవి,

కరకట్టపై 3 గ్రామాల స్వచ్ఛ కార్యకర్తలు సేవచేసిన రోజులు,

ఆరోజుల్లోనే వేల్పూరి ప్రసాదు చేతి మిషన్తో పిచ్చిమొక్కలు చెట్లు నరకడం,

కంపకోసం వెళ్లడం,

కస్తూరి ఆసుపత్రిలో బండలు పగులగొట్టడాలు,

మొద్దులు తోస్తున్నాం అంటున్న నరసింహారావు బృందం,

పైడిపాముల కృష్ణకుమారి గారు, లాయర్ మురళి 1,2 వార్డులలో బహిరంగ మలవిసర్జన ఆపుటకు కృషి చేసిన రోజులు,

చెత్తబండికి విరాళం తెచ్చిన రోజులు,

చల్లపల్లి ODF గా ప్రకటించడానికి డా. పద్మావతిగారు,

పంచాయతీ సెక్రటరీ ప్రసాదుగారు ప్రయత్నం చేసినరోజులు,

చెత్త సంపద కేంద్ర వర్మీ ఎరువుకై డా.పద్మావతి గారు, వాసు, బృందావన్, ఈఓ ప్రసాదుగారు, మాధురి, దుర్గాప్రసాదు,

పడమట పేడదిబ్బలు ఎత్తిన రోజులు,

1100 రోజు నుండి వారం రోజులు డా. పద్మావతి గారి నేతృత్వంలో కార్యకర్తలు పేడదిబ్బలు ఎత్తి డంపింగ్ యార్డుకు పంపిన రోజులు,

కళ్ళేపల్లి రోడ్డులో తాటాకులు మడతొక్కి ఆసుపత్రి చుట్టూ పందిళ్లు వేసిన రోజులు,

రామారావు మాస్టారు కార్యకర్తలపై వారివారి పనితనం బట్టి కవితలు వినిపించిన రోజులు,

మాస్టారూ నేను చెట్టుఎక్కుతున్నా అంటూ చెట్టెక్కిన డాక్టరమ్మ గారు,

మధ్యలో నిలబడి ఫోజిచ్చి ఓ క్లిక్ వేసుకోండి అనే వాసు,

తొక్కకండి సర్ ఇప్పుడే అందంగా చేసాము అనే దుర్గా ప్రసాద్,

ఇంతలో గురూజీ మేమిక్కడున్నాం అంటూ గట్టెక్కి నరుకుతున్న కోడూరు గర్జన,

జోరు వర్షంలో నాటిన మొక్కలు,

వెయ్యి రోజుల ముందు డంపింగ్యార్డులో రెండుపూటలా స్మశానంలో ఉన్న రోజులు,

600 రోజుల పండగకు బైపాస్ రోడ్డు డ్రైన్ బాగుచేసినవి,

మిగిలిన రహదారులకన్న కళ్లేపల్లి రోడ్డుకు చేసిన శ్రమ,

గురువుగారూ బయల్దేరారా నన్నూ తీసికెళ్లారా అనే అన్నపూర్ణ,

చెత్తలోడింగ్ చేస్తూ మాకొటేసుకోండి శ్రీను, నరసింహారావులు

 

తదేక దీక్షతో నెలరోజులు సంతబజారు కేసిన గోడల రంగుల చిత్రాలు,

సుందరీకరణ వారిని మాటలతో ముంచెత్తే మాధురి,

ఇదిగో డాక్టరుగారు వస్తున్నారేమో చూడు

నేను నిచ్చేనెక్కుతాను అని నిచ్చేనెక్కి కొమ్మలు కత్తిరించిన డా.పద్మావతిగారు.

 

శివకుమారి గారితో ఓ ఫోటో అంటే ఈ వయసులో అవసరమా అనే మన రామారావు మాస్టారు,

కళ్లేపల్లి రోడ్డులో రోడ్డు మూసేసిన చెట్లను తొలగించిన వైనం,

  ట్రాక్టరుతో తాటి బొందెలను బృందావన్, సజ్జా ప్రసాదు గారు, బీడీఆర్, శ్రీను తీసికెళ్లిన దృశ్యం,

 

ఆనందాదివారం ముందురోజు ఏటీఎం సెంటరు డా.పద్మావతి గారి బృందం శుభ్రంచేసి మురుగు ఎత్తిన రోజులు,

రామోజీ ఫిల్మ్ సిటీ లో వసుంధర పురస్కారం అందుకునే ముందు పద్మావతి గారి ప్రసంగంలో కార్యకర్తలను సభకు పరిచయం చేసిన వైనం,

డంపింగ్ యార్డు అన్యాక్రాంతం అవుతొందని తెలిసి డా.డీఆర్కే ప్రసాదుగారు కలెక్టర్ గారి వద్దకు (నాదెళ్ల సురేష్ గారు యుఎస్ నుండి అపోయింట్మెంట్ తీసికొన్నారు) డా. పద్మావతి గారు కార్యకర్తలతో జండాలతో డంపింగ్ యార్డులో నినాదాలు ఇచ్చినరోజు,

ఎవరూ ఎలా తాగుతారో అలా కాఫీ ఇచ్చే బృందావన్,

సిన్మారీలులా గిర్రున తిరిగాయి.

 

- ప్రాతూరి శాస్త్రి

21.10.2020.